Gold Price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..-gold and silver prices today on 11 04 2024 check latest rates in your city ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold Price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..

Gold Price Today: ఈ రోజు మీ నగరంలో బంగారం ధరల వివరాలు..

HT Telugu Desk HT Telugu
Apr 11, 2024 09:38 AM IST

Gold and silver prices today : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Pixabay)

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 66,110 కి చేరింది. బుధవారం ఈ ధర రూ. 66,100 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 6,61,000కి చేరింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 6,610 గా కొనసాగుతోంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

మరోవైపు 24 క్యారెట్ల బంగారం (10గ్రాములు) ధర కూడా రూ. 10 పెరిగి.. రూ. 72,120 కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 72,110 గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 7,21,000 గా ఉంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం రేట్లు గురువారం ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,260 గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,270 గాను ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,110 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,120గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,110 గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,270 గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,110 గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,120 గాను ఉంది.

హైదరాబాద్​లో బంగారం ధరలు

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,110 గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,120 గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 65,160 గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,170 గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,110 గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,120 గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,560 గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 85,600 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది.

Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 89,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 85,600.. బెంగళూరులో రూ. 81,100 గా ఉంది.

ప్లాటినం ధరలు ఇలా..

దేశంలో ప్లాటినం రేటు గురువారం స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ. 30 పెరిగి రూ. 26,090 కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 26,060గా ఉంది.

ఇక హైదరాబాద్​లో ప్లాటినం ధర (10గ్రాములు) రూ. 26,090గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

WhatsApp channel