Fire-Boltt Ninja Call Pro Plus: రూ.1,999కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!-fire boltt ninja call pro plus smartwatch launched in india for rs 1999 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Fire-boltt Ninja Call Pro Plus: రూ.1,999కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

Fire-Boltt Ninja Call Pro Plus: రూ.1,999కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2022 08:05 PM IST

Fire-Boltt Ninja Call Pro Plus Smartwatch: ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌వాచ్ అందుబాటులోకి వచ్చింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, పెద్ద డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది.

Fire-Boltt Ninja Call Pro Plus: రూ.1,999కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)
Fire-Boltt Ninja Call Pro Plus: రూ.1,999కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ (Photo: Fire-Boltt)

Fire-Boltt Ninja Call Pro Plus Smartwatch: బడ్జెట్ రేంజ్‍లో స్మార్ట్‌వాచ్‍లు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉన్న వాచ్‍లు తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ లాంచ్ అయింది. బ్లూటూత్ కాలింగ్ సదుపాయంతో ఈ వాచ్ మంగళవారం విడుదలైంది. సేల్‍కు కూడా వచ్చింది. 1.83 ఇంచుల హెచ్‍డీ డిస్‍ప్లేను ఈ వాచ్ కలిగి ఉంది. వాయిస్ అసిస్టెంట్, బుల్ట్ ఇన్ గేమ్స్ కూడా ఉంటాయి. విభిన్న హెల్త్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్స్ తో Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్‌వాచ్ వస్తోంది.

Fire-Boltt Ninja Call Pro Plus Price: ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ ధర, సేల్

ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍తో పాటు ఫైర్ బోల్ట్ వెబ్‍సైట్‍లోనూ ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. బ్లాక్, బ్లాక్ గోల్డ్, గ్రే, పింక్, నేవీ బ్లూ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది.

Fire-Boltt Ninja Call Pro Plus Specifications: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

240x284 పిక్సెల్స్ రెజల్యూషన్ ఉండే 1.83 ఇంచుల హెచ్‍డీ స్క్వేర్ డిస్‍ప్లేతో ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ స్మార్ట్‌వాచ్ వస్తోంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. దీంతో మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లోనే కాల్స్ మాట్లాడవచ్చు. కాల్స్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ లను సేవ్ చేసుకోవచ్చు. రీసెంట్ కాల్ లాగ్స్ కూడా వాచ్‍లో చూడొచ్చు. ఇన్‍బుల్ట్ వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది.

100కుపైగా స్పోర్ట్స్ మోడ్స్ కు ఫైర్ బోల్ట్ నింజా కాల్ ప్రో ప్లస్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, ఎస్‍పీఓ2 హెల్త్ ఫీచర్లు ఉంటాయి. ఇన్‍బుల్ట్ గేమ్స్ కూడా ఈ వాచ్‍లో ఉంటాయి.

బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఫోన్‍కు వచ్చే నోటిఫికేషన్లను ఈ వాచ్‍లోనే పొందవచ్చు. కెమెరాను, మ్యూజిక్‍ను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే Fire-Boltt Ninja Call Pro Plus స్మార్ట్‌వాచ్ 6 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. బ్లూటూత్ కాలింగ్‍తో వాడితే 2 రోజుల వరకు రావొచ్చు.

Whats_app_banner