Driving Mistakes : మాకు తెలుసులేనంటూ సీనియర్ డ్రైవర్లూ ఈ తప్పులు చేస్తారు.. ఇలా కారును నాశనం చేయకండి
Driving Mistakes : ఏళ్ల తరబడి డ్రైవింగ్ చేసేవారు కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారు. దీనితో కారు పాడైపోయే పరిస్థితి వస్తుంది. చాలా మంది క్లచ్‌ని సరిగా వాడరు. దీంతో ప్రతీసారి రిపేర్ చేసేందుకు తీసుకెళ్లాలి.
డ్రైవింగ్‌లో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది అంటుంటారు కొందరు. కానీ చిన్న చిన్న తప్పులు మాత్రం చేస్తూనే ఉంటారు. డ్రైవింగ్‌లో ఎంత సీనియారిటీ ఉందనేది ముఖ్యం కాదు. ఏ సమయంలో దేనిని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండాలి. అప్పుడే కారుకు, మీకు మంచిది. చాలా మంది క్లచ్ విషయంలో తప్పులు చేస్తుంటారు. ఇక కొత్తగా కారు తీసుకున్నవారైతే చాలా తప్పులు చేసి.. రిపేర్‌కు తీసుకెళ్తుంటారు.
మొదటిసారిగా కారు కొనుగోలు చేసేవారిలో అధిక శాతం మందికి సరైన డ్రైవింగ్ అనుభవం ఉండదు. ఈ అనుభవం లేకపోవడం వల్ల కొన్ని కారు భాగాలు పాడయ్యే అవకాశం ఉంది. వాటిలో ఒకటి కారు క్లచ్ ప్లేట్. సాధారణ డ్రైవింగ్ చేసేటప్పుడు జరిగే తప్పులు క్లచ్ ప్లేట్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడండి.
కారు క్లచ్ ప్లేట్‌కు హాని కలిగించే విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. క్లచ్ ప్లేట్‌లు దెబ్బతినే సాధారణ తప్పులు చేయకూడదు. ఇది కొత్త డ్రైవర్లే కాదు.. ఏళ్ల తరబడి కార్లు నడుపుతున్న వారు కూడా చేసే సాధారణ తప్పులు. కారు క్లచ్ పెడల్ దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఒకటి డ్రైవింగ్ చేసేటప్పుడు క్లచ్ పెడల్‌ను నిరంతరం నొక్కడం. మీరు అనవసరంగా క్లచ్ పెడల్‌ను నొక్కితే ఈ భాగం పాడవుతుంది. మళ్లీ మార్చాల్సి ఉంటుంది.
క్లచ్ ప్లేట్ ఎక్కువ రోజులు రావాలంటే.. గేర్‌లను మార్చేటప్పుడు క్లచ్ పెడల్‌ను పూర్తిగా నొక్కాలని గుర్తుంచుకోవాలి. క్లచ్ పెడల్ అడపాదడపా తొక్కితే వర్క్‌షాప్‌కు తరచుగా వెళ్లడం అవసరం అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు సిగ్నల్ వద్దకు వచ్చారనుకుందాం. ఈ సందర్భంలో క్లచ్‌పై అనవసరమైన ఒత్తిడిని నివారించడానికి న్యూట్రల్ గేర్‌కి మార్చండి.
చాలా మంది డ్రైవర్లు క్రమం తప్పకుండా చేసే పొరపాటు ఏంటంటే.. గేర్‌లను మార్చేటప్పుడు క్లచ్ పెడల్‌ను పూర్తిగా తొక్కరు. కచ్చితంగా చెప్పాలంటే క్లచ్‌ను సగం తొక్కి.. గేర్ మారుస్తారు. ఈ అలవాటు అకస్మాత్తుగా క్లచ్ ప్లేట్ దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. తర్వాత మీ జేబు ఖాళీ అవుతుంది.
డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది చేసే మరో పని ఏమిటంటే యాక్సిలరేటర్ పెడల్, క్లచ్ పెడల్ ఒకేసారి నొక్కడం. యాక్సిలరేటర్‌ను చప్పుడు చేయడం కొంతమందికి అలవాటుగా ఉంటుంది. అయితే ఇది క్లచ్ పెడల్‌కు అంత మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఈ అలవాటు క్లచ్ ప్లేట్‌ను దెబ్బతీసే ప్రమాదాన్ని బాగా పెంచుతుంది. రిపేర్ ఖర్చు ఎక్కువ అవుతుంది.
డ్రైవింగ్ అలవాట్లలో ఇలాంటి తప్పులు చేస్తుంటే.. వీలైనంత త్వరగా వాటిని నివారించడానికి ప్రయత్నిస్తే క్లచ్ ప్లేట్ ఎక్కువ రోజులు వచ్చేలా చేసుకోవచ్చు. కొంతమంది కారు క్లచ్ ప్లేట్‌ను కొన్ని రోజులకే మార్చాలని అనుకుంటారు. కానీ మన డ్రైవింగ్ అలవాట్ల వల్ల ఇలా చేయాల్సి వస్తుంది. మీరు క్లచ్ సరిగా ఉపయోగిస్తే ఈ సమస్య రాదు.
క్లచ్ ప్లేట్‌ను సరిగ్గా మెయింటెన్ చేస్తే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు. డ్రైవింగ్‌లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఈ క్లచ్ ప్లేట్ త్వరగా అరిగిపోవడానికి ప్రధాన కారణం. పైన చెప్పినవరి ఫాలో అయితే.. క్లచ్ ప్లేట్ చాలా కాలం పాటు వస్తాయి.
టాపిక్