Airtel tariff hike: మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పిన ఎయిర్ టెల్ చీఫ్
Airtel tariff hike: ఎయిర్ టెల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. త్వరలో ఎయిర్ టెల్ మొబైల్ సర్వీస్ రేట్లు పెరగనున్నాయి.
మొబైల్ ఫోన్ కాల్స్ రేట్స్ ను, డేటా రేట్స్ ను త్వరలో పెంచనున్నట్లు ఎయిర్ టెల్ (Airtel) ప్రకటించింది. దేశవ్యాప్తంగా, అన్ని సర్కిళ్ల లో, అన్ని ప్లాన్లలో ఈ పెంపు ఉంటుందని ఎయిర్ టెల్ (Airtel) చైర్మన్ సునీల్ మిట్టల్ (Sunil Bharti Mittal) వెల్లడించారు.
Airtel tariff hike: ధరల పెంపు
ఎయిర్ టెల్ (Airtel) టారిఫ్ ల పెంపుతో వినియోగదారులపై భారం పెరగనుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే మినిమం రీచార్జ్ ప్లాన్ పై ఎయిర్ టెల్ గత నెలలో టారిఫ్ ను 57% పెంచింది. దేశవ్యాప్తంగా 8 సర్కిళ్లలో ఈ మినిమం రీచార్జ్ ప్లాన్ ధర రూ. 155 కి చేరింది. ఎయిర్ టెల్ (Airtel) చైర్మన్ సునీల్ భార్తి మిట్టల్ (Sunil Bharti Mittal) బార్సిలోనాలో జరుగుతున్న వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్ టెల్ టారిఫ్ పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ టెల్ (Airtel) మంచి లాభాలతో కొనసాగుతున్న సమయంలో కూడా.. అన్ని ప్లాన్లపై టారిఫ్ పెంపు సమంజసమేనా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. టెలీకాం బిజినెస్ లో పెట్టుబడిపై వస్తున్న రిటర్న్ (return on capital) చాలా తక్కువ అని వివరించారు. అందువల్ల ఈ సంవత్సరం అన్ని ప్లాన్లపై టారిఫ్ పెంపు ఉంటుందని Sunil Bharti Mittal స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో, అన్ని ప్లాన్లపై ఈ పెంపు ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో 5జీ (5G) సేవలు సహా పలు అంశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Airtel tariff hike: మిగతా ఖర్చుల కన్నా తక్కువే..
మొబైల్ వినియోగం, డేటా వినియోగం తప్పని సరైన పరిస్థితుల్లో ఇలా అన్ని ప్లాన్లపై టారిఫ్ ను పెంచడం సామాన్యులపై భారం వేయడం కాదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ప్రజలు వేరే ఇతర అవసరాల కోసం పెడ్తున్న ఖర్చుతో పోలిస్తే, మొబైల్ ఫోన్ సేవల కోసం పెడ్తున్న ఖర్చు చాలా తక్కువేనని ఎయిర్ టెల్ (Airtel) చైర్మన్ సునీల్ మిట్టల్ (Sunil Bharti Mittal) వ్యాఖ్యానించారు. ‘ఆదాయం పెరిగింది. వేతనాలు పెరిగాయి. అలాగే, ఇతర అన్ని ఖర్చులు పెరిగాయి. ప్రజలు ఇప్పుడు ఏమీ చెల్లించకుండానే 30 జీబీ డేటా వినియోగిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) ఎదుర్కొన్న పరిస్థితులు ఇతర కంపెనీలు కూడా ఎదుర్కొనే పరిస్థితి రాకూడదు’’ అన్నారు. భారత్ లో బలమైన టెలీకాం కంపెనీ ఉండాల్సిన అవసరం ఉందని సునీల్ మిట్టల్ (Sunil Bharti Mittal) అన్నారు.
Airtel tariff hike: కనీసం మూడు సంస్థలు ఉండాలి
భారత్ వంటి పెద్ద దేశంలో కనీసం మూడు ప్రధాన టెలీకాం సంస్థల సేవలు అందుబాటులో ఉండాలి. ఎయిర్ టెల్ (Airtel), జియో (Reliance Jio) ఇప్పటికే ఈ రంగంలో స్థిరపడ్డాయి. మూడో ఆపరేటర్ గా బీఎస్ఎన్ఎల్(BSNL) నిలుస్తుందా? వొడాఫొన్ ఐడియా (Vodafone Idea) వస్తుందా? అనేది వేచి చూడాలి’ అని మిట్టల్ విశ్లేషించారు. ఇప్పటికే ఎయిర్ టెల్ రూ. 99 మంత్లీ ప్లాన్ ను నిలిపేసింది. ప్రస్తుతం ఒక్కో యూజర్ పై ఎయిర్ టెల్ సగటు సంపాదన (ARPU) స్వల్పకాలిక లక్ష్యం రూ. 200గా ఉంది. ఈ లక్ష్యాన్ని దీర్ఘకాలికంగా రూ. 300లకు పెంచాలని ఎయిర్ టెల్ యోచిస్తోంది. అందులో భాగంగానే టారిఫ్ ల పెంపుపై నిర్ణయం తీసుకుంది.