Azad IPO: ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన; గ్రే మార్కెట్లో రూ. 440 ప్రీమియం
Azad IPO: ఆజాద్ ఇంజినీరింగ్ IPO డిసెంబర్ 20న సబ్‌స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయింది. డిసెంబర్ 22 శుక్రవారంతో ముగుస్తుంది. IPO ప్రైస్ బ్యాండ్ రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 499 నుండి రూ. 524 మధ్య ఉంది.
Azad IPO: ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఐపీఓ ఓపెన్ అయిన తొలిరోజే ఫుల్ గా సబ్ స్క్రైబ్ అయింది.
ఐపీఓ వివరాలు..
ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓ (Azad Engineering IPO) కు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 22 వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓకు లాట్స్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో రూ. 2 ముఖ విలువ కలిగిన 28 ఈక్విటీ షేర్లు ఉంటాయి. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను రూ. 499 నుంచి రూ. 524 మధ్య నిర్ణయించారు. అంటే, ఒక్కో లాట్ కు గరిష్ట ప్రైస్ బ్యాండ్ తో ఇన్వెస్టర్ రూ. 14,672 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 26వ తేదీన అలాట్మెంట్ జరిగే అవకాశముంది.
సబ్ స్క్రిప్షన్ స్టేటస్..
ఈ ఐపీఓలో 50% షేర్లను క్యూఐబీ (QIB) లకు, 15% ఎన్ఐఐ (NII) లకు, 35% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. రూ. 4 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగస్తులకు రిజర్వ్ చేశారు. ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తొలి రోజే 1.37 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. NII వాటా 1.50 రెట్లు, QIB ల నుంచి తొలి రోజు పెద్దగా స్పందన కనిపించలేదు. ఉద్యోగుల వాటాలో 75% బుక్ అయింది.
కంపెనీ వివరాలు..
ఆజాద్ ఇంజినీరింగ్ లిమిటెడ్ టర్బైన్లు, విమానాల విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ రంగాలకు అవసరమైన విడి భాగాలను ఉత్పత్తి చేస్తుంది.
జఎంపీ ఎంత?
ఆజాద్ ఇంజనీరింగ్ ఐపీఓ కు గ్రే మార్కెట్ లో మంచి స్పదన లభిస్తోంది. ఈ ఐపీఓ షేర్లు డిసెంబర్ 20న గ్రే మార్కెట్లో రూ. రూ. 440 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అంటే, ఇష్యూ ప్రైస్ పై, ఒక్కో షేర్ పై కనీసం రూ. 440 లాభాన్ని ఇన్వెస్టర్ పొందే అవకాశం ఉంది.