Audi Q3 Sportback: ఆడీ నయా కారు వచ్చేసింది.. కళ్లు చెదిరే ధరతో..-audi q3 sportback suv launched in india for 51 43 lakh rupees check features upgrades full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Audi Q3 Sportback: ఆడీ నయా కారు వచ్చేసింది.. కళ్లు చెదిరే ధరతో..

Audi Q3 Sportback: ఆడీ నయా కారు వచ్చేసింది.. కళ్లు చెదిరే ధరతో..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 13, 2023 05:34 PM IST

Audi Q3 Sportback launched: ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ప్రీమియమ్ ఎస్‍యూవీ వచ్చేసింది. క్యూ3 లైనప్‍లో టాప్ వేరియంట్‍గా అడుగుపెట్టింది.

Audi Q3 Sportback: ఆడీ నయా కారు వచ్చేసింది.. కళ్లు చెదిరే ధరతో..
Audi Q3 Sportback: ఆడీ నయా కారు వచ్చేసింది.. కళ్లు చెదిరే ధరతో..

Audi Q3 Sportback launched in India: ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఎస్‍యూవీ ఇండియాలో లాంచ్ అయింది. స్టాండర్డ్ క్యూ3కి టాప్-స్పెక్ వేరియంట్‍గా ఈ స్పోర్ట్‌బ్యాక్ మోడల్‍ను నేడు (ఫిబ్రవరి 13) భారత మార్కెట్‍లో లాంచ్ చేసింది ఆడీ. అప్‍డేటెడ్ డిజైన్‍తో ఈ నయా మోడల్ వచ్చింది. ఐదు కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇవే.

Audi Q3 Sportback: డిజైన్ మార్పులు ఇవే

స్టాండర్డ్ క్యూ3తో పోలిస్తే నయా ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ డిజైన్‍లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఎస్-లైన్ స్టైలింగ్ ప్యాక్‍ ఈ నయా మోడల్ ఎక్స్‌టీయర్‌కు ఉంది. హనీకాంబ్ ప్యాటర్న్ ఉండే హెక్సాగోనల్ గ్రిల్‍తో స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్ వస్తోంది. సిల్వర్ ఫినిష్‍తో ఎయిర్ ఇన్‍టేక్స్ మరింత షార్ప్‌గా మారాయి. 18 ఇంచుల అలాయ్ వీల్స్ మరింత స్పోర్టీ లుక్‍ను కలిగి ఉన్నాయి. అలాగే కూప్ రూఫ్ లైన్‍ను Audi Q3 Sportback కలిగి ఉంది. ఎల్ఈడీ హెడ్‍ల్యాంప్స్, ఎల్ఈడీ టైల్ లైట్స్ డిజైన్‍లో కాస్త మార్పు ఉంది.

Audi Q3 Sportback: ఇంటీరియర్ విషయానికి వస్తే స్టాండర్డ్ క్యూ3 ఎస్‍యూవీలానే ఉంది. 10.1 ఇంచుల టచ్‍స్క్రీన్, ఆడీ వర్చువల్ కాక్‍పిట్ ఆల్ డిజిటల్ ఇన్‍స్ట్రుమెంటల్ క్లస్టర్‍‍తోనే ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ వచ్చింది. స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూజ్ కంట్రోల్, ప్రొగ్రెసివ్ స్టీరింగ్, సెవెన్ స్పీడ్ ఎస్ ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‍ ఉంటాయి. 30 కలర్ యాంబియెంట్ లైటింగ్, పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, టూ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ చార్జింగ్, 10 స్పీకర్లు, ఆరు చానెల్ యాంప్లిఫయర్‌తో కూడిన ఆడియో సౌండ్ సిస్టమ్ ఈ ప్రీమియమ్ కారు క్యాబిన్‍లో ఉంటాయి. ప్యానరోమాటిక్ సన్‍రూఫ్ ఉంటుంది.

Audi Q3 Sportback: ఇంజిన్, పర్ఫార్మెన్స్

క్యూ3 స్టాండర్డ్ వేరియంట్‍లాగే 2.0-లీటర్ టర్బో TFSI పెట్రోల్ ఇంజిన్‍ను ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కలిగి ఉంది. 190 hp గరిష్ఠ పవర్, 320Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. 7-స్పీడ్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. 0 నుంచి 100 kmph వేగానికి కేవలం 7.3 సెకన్లలోనే ఈ ఎస్‍యూవీ యాక్సలరేట్ అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటలకు 220 కిలోమీటర్ల వేగం (kmph)గా ఉంది.

Audi Q3 Sportback: ధర

ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధర ఇండియాలో రూ.51.43లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ నయా మోడల్ బుకింగ్‍లను ఆడీ మొదలుపెట్టింది. రూ.2లక్షలను టోకెన్ అమౌంట్‍గా చెల్లించి బుక్ చేసుకోవచ్చు. టర్బో బ్లూ, గ్లేసియర్ వైట్, క్రోనోస్ గ్రే, మైథోస్ బ్లాక్, నవార్రా బ్లూ కలర్ ఆప్షన్‍లలో Audi Q3 Sportback లభిస్తుంది. క్యూ3 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.44.89 లక్షలుగా ఉంది. ఈ లైనప్‍లో ఇప్పుడు లాంచ్ అయిన స్పోర్ట్‌బ్యాక్ టాప్ ఎండ్‍గా ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం