Air India sale: రూ. 1470 కే ఫ్లైట్ టికెట్; విమాన టికెట్ల బుకింగ్ పై ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్
Air India sale: విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా శుభవార్త తెలిపింది. ఆదివారం వరకు, నాలుగు రోజుల పాటు స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తమ వెబ్ సైట్, మొబైల్ యాప్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నవారికి కన్వీనియెన్స్ ఫీజు (convenience fee) ఉండదని తెలిపింది.
Air India sale: విమాన ప్రయాణీకులకు ఎయిర్ ఇండియా శుభవార్త తెలిపింది. ఆదివారం వరకు, నాలుగు రోజుల పాటు స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. తమ వెబ్ సైట్, మొబైల్ యాప్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నవారికి కన్వీనియెన్స్ ఫీజు (convenience fee) ఉండదని తెలిపింది.
ఎయిర్ ఇండియా స్పెషల్ సేల్
ప్రభుత్వ రంగంలో ఉన్న ఎయిర్ ఇండియా విమాన యాన సంస్థను ఇటీవల టాటా గ్రూప్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా, ఎయిర్ ఇండియా ఒక బంపర్ సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 20 వరకు, అంటే ఆదివారం వరకు, 96 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్ లో భాగంగా.. ఆదివారం వరకు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచి కానీ, మొబైల్ యాప్ నుంచి కానీ విమాన టికెట్స్ బుక్ చేసుకున్నవారికి కన్వీనియెన్స్ ఫీజు (zero convenience fee) ఉండదని ప్రకటించింది.
కండిషన్స్ అప్లై..
అయితే, ఈ ఆఫర్ పొందడానికి కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ముందుగా, సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ లోపు జరిగే ప్రయాణాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే, కొన్ని ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణ మార్గాలకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే, ఎంపిక చేసిన దేశీయ, విదేశీ మార్గాల్లో, సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు చేసే విమాన ప్రయాణ టికెట్స్ ను ఆదివారం, ఆగస్ట్ 20 లోపు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచి కానీ, మొబైల్ యాప్ నుంచి కానీ బుక్ చేస్తేనే ఈ కన్వీనియెన్స్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అలాగే, ఈ సేల్ లో లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
domestic tickets rates: ఇవీ రేట్లు..
ఎంపిక చేసిన డొమెస్టిక్ మార్గాల్లో ఈ సేల్ ద్వారా బుక్ చేసే టికెట్ ధర ఎకానమీ క్లాస్ లో రూ. 1470 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 10,130 నుంచి ప్రారంభమవుతుంది. వివిధ దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల్లోనూ చవకగా టికెట్ రేట్లు ఉన్నాయి. గురువారం, ఆగస్ట్ 17 నుంచి ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు, అంటే 96 గంటల పాటు ఈ సేల్ ఉంటుంది.