4 RE bikes to launch in 2023: ఈ సంవత్సరం మార్కెట్లోకి 4 కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్-4 royal enfield motorcycles to launch in 2023 new bullet 350 to himalayan 450 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  4 Re Bikes To Launch In 2023: ఈ సంవత్సరం మార్కెట్లోకి 4 కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్

4 RE bikes to launch in 2023: ఈ సంవత్సరం మార్కెట్లోకి 4 కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్

HT Telugu Desk HT Telugu
May 27, 2023 08:44 PM IST

4 Royal Enfield bikes to launch in 2023: మరో నాలుగు కొత్త మోడల్ బైక్స్ ను ఈ సంవత్సరం మార్కెట్లో విడుదల చేయాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650 (ప్రతీకాత్మక చిత్రం)
రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650 (ప్రతీకాత్మక చిత్రం)

వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రొడక్ట్స్ ను లాంచ్ చేసే దిశగా రాయల్ ఎన్ ఫీల్డ్ కృషి చేస్తోంది. సూపర్ మిటియో 650 (Super Meteor 650), ఇంటర్ సెప్టార్ 650 అప్ డేటెడ్ (updated Interceptor 650) వర్షన్ ను, కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) ని ఈ సంవత్సరం ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఇదే సంవత్సరం మరో నాలుగు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేయాలని రాయల్ ఎన్ ఫీల్డ్ యోచిస్తోందని సమాచారం. అవి..

Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450

ఈ మోడల్ చాన్నాళ్లుగా వార్తల్లో ఉంది. చాలామంది అభిమానులు ఈ మోడల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో లిక్విడ్ కూల్డ్ 450 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఈ సంవత్సరం దీపావళి నాటికి ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 450 మార్కెట్లోకి రానుంది.

Royal Enfield Bullet 350: రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350

బుల్లెట్ 350 రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఇప్పడు కొత్తగా జే ప్లాట్ ఫామ్ పై, అదే ఇంజన్ తో ఈ న్యూ జనరేషన్ బుల్లెట్ ను రూపొందించారు. క్లాసిక్ 350 తో పోలిస్తే, ఇది కొంత బేసిక్ లుక్స్ తో ఉంటుంది.

Royal Enfield Shotgun 650: రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650

650 సీసీ కేటగిరీలో ఈ సంవత్సరం జనవరిలో తమ ఫ్లాగ్ షిప్ మోడల్ సూపర్ మీటియొ 650 (Super Meteor 650) ని రాయల్ ఎన్ ఫీల్డ్ లాంచ్ చేసింది. ఇప్పుడు మిడ్ సెట్ ఫుట్ పెగ్స్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, డిఫరెంట్ ఎగ్జాస్ట్ డిజైన్ తో కొత్తగా షాట్ గన్ 650 (SG650) మోడల్ ను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

Royal Enfield Classic Bobber 350: క్లాసిక్ బాబర్ 350

అప్ డేటెడ్ క్లాసిక్ 350 వర్షన్ గా, సింగిల్ సీట్ తో ఈ క్లాసిక్ బాబర్ 350 మార్కెట్లోకి రానుంది. ఈ మోడల్ పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

WhatsApp channel