Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’-110 stock split multibagger ipo turns rs 1 20 lakh into rs 1 crore in 4 years ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Multibagger Ipo: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

Multibagger IPO: ‘నాలుగేళ్ల క్రితం ఈ ఐపీఓలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు..’

HT Telugu Desk HT Telugu
May 16, 2024 03:13 PM IST

Multibagger IPO: నాలుగేళ్ల క్రితం ఈ కంపెనీ ఐపీఓకు వచ్చింది. ఆ సమయంలో ఈ కంపెనీలో రూ. 1.2 లక్షలు ఇన్వెస్ట్ చేసినవారు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు. నాలుగేళ్లలో వారి షేర్ల విలువ రూ. 1 కోటి దాటింది.

రూ. 1 లక్షతో రూ. 1 కోటి లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్
రూ. 1 లక్షతో రూ. 1 కోటి లాభం తెచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్ (Photo: Pixabay)

Multibagger IPO: స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయడం లాంటిది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వీలైనంత ఎక్కువ కాలం వాటిని హోల్డ్ చేయాలి. స్టాక్స్ లో మంచి లాభాల కోసం వాటిని కొంత కాలం హోల్డింగ్ లో ఉంచడం మంచిది. కాబట్టి, సాధ్యమైనంత వరకు స్టాక్స్ ను హోల్డ్ చేసుకోవాలి; ఈ నియమం ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. కంపెనీ ప్రతిపాదిత షేర్ల న్యాయమైన ధర సాధించే వరకు ఐపీఓ ఇన్వెస్టర్ ఆ స్టాక్ ను అమ్మవద్దు.

ఎక్కువ కాలం హోల్డింగ్..

స్టాక్స్ ను ఎక్కువ కాలం హోల్డింగ్ లో ఉంచడం వల్ల ఎంత లాభం వస్తుందో అర్థం చేసుకోవడానికి సూరత్వాలా బిజినెస్ కంపెనీ షేర్ ప్రైస్ హిస్టరీని పరిశీలించాలి. సూరత్వాలా బిజినెస్ ఐపీఓను 2020 ఆగస్టులో ఒక్కో షేరుకు రూ.15 ఫిక్స్డ్ ధరతో ప్రారంభించారు. ఈ ఐపీఓ లో ఒక్కో లాట్ లో 8 వేల ఈక్విటీ షేర్లు ఉంటాయి. రూ. 15 ఇష్యూ ప్రైస్ తో ఒక్కో లాట్ కు ఇన్వెస్టర్ రూ. 1.2 లక్షలు (రూ .15 x 8000) పెట్టుబడి పెట్టాలి. 2020 ఆగస్టు 13న ఈ సూరత్వాలా బిజినెస్ షేరు రూ.15.45 వద్ద లిస్ట్ అయింది. అంటే, ఈ స్మాల్ అండ్ మీడియం రేంజ్ ఎంటర్ ప్రైజ్ పెద్దగా లిస్టింగ్ గెయిన్స్ లేకుండానే మార్కెట్లోకి వచ్చింది. సాధారణంగా, చాలామంది ఇన్వెస్టర్లు ఇదే సమయంలో షేర్లను అమ్మేసి ఎగ్జిట్ అయిపోతారు. కానీ, ఈ కంపెనీ ఐపీఓ స్టాక్స్ ను అట్టిపెట్టుకున్న ఇన్వెస్టర్లు మాత్రం జాక్ పాట్ కొట్టారు.

1:10 స్ప్లిట్ షేర్స్

సాఫ్ట్ లిస్టింగ్ తరువాత, ఈ స్టాక్ చాలా ఒడిదుడుకులను ప్రదర్శించింది. చివరకు నిలదొక్కకుంది. ఏప్రిల్ 18, 2024 న కంపెనీ 1:10 స్టాక్ విభజనను ప్రకటించింది. అంటే ఐపీఓ లో అలాట్ అయిన 8 వేల స్టాక్స్ ను అమ్మకుండా అలాగే అట్టిపెట్టుకున్న ఇన్వెస్టర్లకు 1:10 చొప్పున.. వారి వద్ద ఉన్న 8 వేల షేర్లు 80 వేల షేర్లుగా మారాయి. సూరత్ వాలా బిజినెస్ షేరు ధర మే 16 గురువారం, ఉదయం ట్రేడింగ్ లో ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.125.40 కి చేరుకుంది. అంటే, ఐపీఓ లో అలాట్ అయిన వారు పెట్టిన ప్రారంభ పెట్టుబడి విలువ అయిన రూ .1.20 లక్షలు.. నాలుగేళ్లలో రూ .1,00,32,000 లకు పెరిగింది. పెట్టుబడులలో నిబద్ధత, సహనం కలిగి ఉన్నవారికి కలిగే లాభం ఇది.

డిస్క్లైమర్: పైన చేసిన అభిప్రాయాలు మరియు సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగువి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.