TS Assembly Elections | ఎన్నికల వేళ తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ భద్రత
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని మెుత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ కొనసాగనున్నది. సిర్పూర్, చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందులో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని ఈసీ తెలిపింది. ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల్లో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.