తెలుగు బిగ్ బాస్ విజేత ప్రకటన అనంతరం అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వెలుపల కార్లపై దాడిగి తెగబడ్డారు. తొలుత రన్నరప్ అమర్‌దీప్ కారు అద్ధాలను ధ్వంసం చేశారు. కాసేపటికే బయటికొచ్చిన ఏడవ సీజన్ కంటెస్టెంట్ అశ్వినిశ్రీ, పాత సీజన్ కంటెస్టెంట్ గీతు రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. అంతకు ముందు అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అద్దాలను పగులగొట్టారు. తన కారును పగులగొట్టిన విధానాన్ని వివరిస్తూ అశ్విని బాధపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.