గుజరాత్ లోని అరేబియా సముద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ మరో సాహసం చేశారు. సముద్రంలో ముగిని పోయిందని పురాణాలు చెబుతున్న ద్వారకా నగరంలో వద్ద ప్రత్యేక పూజలు మోదీ చేశారు. సముద్రంలో మునిగి ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం చాలా దివ్యమైన అనుభూతి అని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ద్వారకా నగరాన్ని ఒకప్పుడు శ్రీకృష్ణుడు పాలించిన ప్రదేశంగా నమ్ముతారు. ఈ నగరం శతాబ్దాల క్రితం సముద్రంలో మునిగిపోయింది. ద్వారకా బీచ్ నుంచి స్కూబా డైవింగ్‌ను ద్వారా అరేబియా సముద్రంలో అడుగున పురాతన ద్వారక నగరం అవశేషాలు కనపడుతాయి.