Mamata Banerjee: రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పిన సీఎం మమతా బెనర్జీ
Mamata Banerjee: రాష్ట్రపతి దౌప్రది ముర్ముకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. బెంగాల్ మంత్రి అఖిల్ గిరి ఇటీవల రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతికి మమత క్షమాపణలు తెలిపారు. రాష్ట్రపతి అంటే తమకు అపారమైన గౌరవం ఉందని, ఆమె చాలా మంచి వ్యక్తి అని మమత చెప్పారు. అఖిల్ గిరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతిపై అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారీ స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్రపతి రూపంపై అఖిల్ గిరి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆమెకు క్షమాపణలు చెప్పారు.