వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని వచ్చేంత వరకు హైదరాబాద్ కొనసాగితే బాగుంటుందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక రాజధానిని నిర్మించిందని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలనా రాజధానిగా అనుకున్నామన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్న వైవీ.. ఎన్నికల తర్వాత జగన్ దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందన్నారు.