Hyderabad Metro : మెట్రో రైళ్ల స్పీడ్ పెంపు.. ఇకపై మరింత వేగంగా..-hyderabad metro trains to run at the full speed of 80 km per hour ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro : మెట్రో రైళ్ల స్పీడ్ పెంపు.. ఇకపై మరింత వేగంగా..

Hyderabad Metro : మెట్రో రైళ్ల స్పీడ్ పెంపు.. ఇకపై మరింత వేగంగా..

HT Telugu Desk HT Telugu
Apr 03, 2022 07:50 AM IST

హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లు పూర్తి వేగంతో నడవనున్నాయి. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్వే సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్‌) అనుమతి ఇచ్చింది. ఇకపై గంటకు గరిష్ఠంగా 80 కి.మీ. వేగంతో ఈ రైళ్లను నడపనున్నారు.

<p>మెట్రో రైల్ మరింత స్పీడుగా…</p>
మెట్రో రైల్ మరింత స్పీడుగా… (twitter)

హైదరాబాద్ మెట్రో రైలు... మరింత దూసుకెళ్లనుంది. ఇప్పటిదాకా గంటకు 40 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ రైళ్లు స్పీడు పెంచనున్నాయి. ఇక నుంచి 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నాయి. ఈ మేరకు కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) నుంచి అనుమతి లభించింది.

ప్రస్తుతం మెట్రోరైళ్ల గరిష్ఠ వేగం గంటకు 70 కి.మీ.గా ఉంది. తాజా నిర్ణయంతో నాగోల్‌ నుంచి రాయదుర్గానికి 6 నిమిషాల సమయం, మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌కు 4 నిమిషాలు ముందుగానే చేరుకోవచ్చు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మార్గంలోనూ కొంత సమయం ఆదా అవుతుందని మెట్రో అధికారులు తెలిపారు.

తాజాగా బంపర్ ఆఫర్...

హైదరాబాద్ లో ఉండేవారికి, నగరాన్ని సందర్శించే వారికి.. తాజాగా హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. సూపర్ సేవర్ కార్డును తీసుకొచ్చింది. దీంతో రూ.59 ఉండే చాలు.. మెట్రోలో భాగ్యనగరాన్ని చూట్టేయోచ్చు. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని రోజులను కేటాయించింది. ప్రతి రోజూ వెళ్లి.. 59కే తిరగాలంటే.. కుదరదు.. ప్రత్యేకంగా చెప్పిన రోజుల్లోనే తిరగాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎల్&టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. సూపర్ సేవర్ కార్డుతో ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

'సూపర్ సేవర్ కార్డుతో కేవలం రూ.59తో రోజంతా ప్రయాణించవచ్చు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ కార్డును వినియోగించుకోవచ్చు. అయితే ఇందులో ఒక కండీషన్ ఉంది. ప్రతీ ఆదివారం, ప్రతీ రెండో, నాలుగో శనివారం, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్ డే, బోగి, శివరాత్రి.. ఇలా మెుత్తం 100 సెలవు రోజుల్లో ఈ ఆఫర్ వర్తిస్తుంది.' అని కేవీబీ రెడ్డి తెలిపారు.

‘కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ తర్వాత మళ్లీ హైదరాబాద్ మెట్రో గాడిలో పడుతోంది. అప్పుడు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాం. లాక్ డౌన్ సమయంలో ఎక్కువ రోజులు రైళ్లు నిలిపివేయాల్సి వచ్చింది. కరోనా కారణంగా.. నడిచిన రోజుల్లోనూ.. కొన్ని రోజులు ప్రయాణికులు మెట్రో రైళ్లు ఎక్కడంపై ఆసక్తి చూపించలేదు. ఈ కారణంగా నష్టాలు వచ్చాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో.. మళ్లీ ప్రయాణికుల సంఖ్య పెరిగింది. 60 శాతం వరకు రద్దీ ఉంది. ప్రయాణికుల కోసమే.. మెట్రో సూపర్ సేవర్ కార్డును తీసుకొస్తున్నాం. ఉపయోగించుకోవాని కోరుతున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉగాది రోజు నుంచి హైదరాబాద్ మెట్రో సూపర్‌ సేవర్‌ కార్డులు అందుబాటులోకి వచ్చా యి

Whats_app_banner