Vinesh Phogat: వినేష్ ఫోగాట్ చనిపోతుందనుకున్నాం - కోచ్ కామెంట్స్ వైరల్
Vinesh Phogat: ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ యాభై కేజీల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ డిస్ క్వాలిఫై అయ్యి పతకానికి దూరమైంది. ఫైనల్ ముందు రోజు బరువు తగ్గడానికి వినేష్ చేసిన ప్రయత్నాలపై ఆమె కోచ్ వోలర్ అకోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Vinesh Phogat: ఒలింపిక్స్ 2024లో రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ అనూహ్యంగా డిస్ క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఫైట్‌కు ముందు వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై ఒలింపిక్స్ నిర్వహకులు అనర్హత వేటు వేశారు. తన అనర్హతపై కోర్డ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (సీఏఎస్)ను వినేష్ ఫోగాట్ ఆశ్రయించింది.
పోస్ట్ వైరల్...
తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని పిటిషన్ వేసింది. అయితే ఆమె పిటిషన్‌ను సీఎఎస్ కొట్టిపడేసింది. సీఏఎస్ తీర్పు అనంతరం రెజ్లింగ్ మ్యాట్‌పై కుప్పకూలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటోన్న ఈ ఫొటోను ట్విట్టర్‌లో వినేష్ పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఏఎస్ తీర్పుతో నిరాశలో మునిగిపోయిన వినేష్‌కు ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు మద్ధుతుగా నిలుస్తోన్నారు.
కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు...
“ఫైనల్ ముందురోజు బరువు తగ్గడానికి వినేష్ ఫోగాట్ చేసిన ప్రయత్నాలపై ఆమె కోచ్ వోలర్ అకోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత వినేష్ 2.7 కిలోల బరువు పెరిగింది. వెయిట్ తగ్గించుకోవడానికి తొలుత గంట ఇరవై నిమిషాల పాటు వినేష్‌తో ఎక్సర్‌సైజులు చేయించాం. యాభై నిమిషాల సౌనా బాత్ తర్వాత మరో ఒకటిన్నర కిలోల బరువు తగ్గాలని అర్థమైంది.
ఫైనల్ మ్యాచ్ ముందు రోజు నిద్రకూడా పోకుండా ఉదయం ఐదున్నర వరకు వినేష్ ట్రెడ్‌మిల్, సైక్లింగ్ వంటి కార్డియో ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తూనే ఉంది. రెజ్లింగ్, సౌనా బాత్ ద్వారా ఆమె వెయిట్ తగ్గించేందుకు చాలా ప్రయత్నించాం. సాధారణంగా చేసే ఎక్స్‌ర్‌సైజ్‌లకు కంటే మూడింతలు కఠినంగా శ్రమించింది...గంటలో రెండు నుంచి మూడు నిమిషాలకు మించి విశ్రాంతి లేకుండా నిర్వరామంగా పోరాడింది” అని తెలిపాడు.
చనిపోతుందనుకున్నాం...
“అంతేకాకుండా వ్యాయామం తర్వాత యాభైనిమిషాల పాటు సౌనా బాత్ (ఆవిరి స్నానం) కూడా చేసింది. విశ్రాంతి లేకుండా ఎక్స్‌ర్‌సైజులు చేయడంలో ఒకానొక టైమ్‌లో అలిసిపోయి కుప్పకూలిపోయింది. నిల్చోలేకపోయిందని కోచ్ అన్నాడు. తామే కష్టపడి వినేష్‌ను పైకి లేపామని చెప్పాడు.
బరువు తగ్గడానికి వినేష్ పడుతోన్న కష్టం చూసి ఎక్కడ చనిపోతుందోనని భయపడ్డామని, చివరకు వంద గ్రాముల దూరంలో ఆమె పోరాటం ముగిసిందని” కోచ్ వోలర్ అకోస్ తెలిపాడు. బరువు తగ్గడానికి వినేష్ పోగాట్ చేసిన ప్రయత్నాల గురించి కోచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోన్నాయి. ఒలింపిక్స్ నుంచి డిస్ క్వాలిఫై కావడంతో వినేష్ రెజ్లింగ్‌కు గుడ్‌బై చెప్పింది.