CWG 2022 Day 8 India Schedule: కామన్వెల్త్ గేమ్స్‌లో 8వ రోజు ఇండియా షెడ్యూల్ ఇదే
CWG 2022 Day 8 India Schedule: కామన్వెల్త్ గేమ్స్‌లో 7వ రోజు అదరగొట్టిన ఇండియన్ అథ్లెట్లు ఇక 8వ రోజు మరిన్ని మెడల్స్‌పై కన్నేశారు. 7వ రోజు ఓ గోల్డ్, సిల్వర్ సాధించిగా ఇవి రెండూ సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఇక ఇప్పుడు 8వ రోజు అందరి కళ్లూ రెజ్లర్లపైనే ఉన్నాయి.
బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో ఏడో రోజు ఇండియాకు పారా-పవర్‌లిఫ్టర్ సుధీర్ గోల్డ్ మెడల్, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ సిల్వర్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇక బాక్సర్లు అమిత్ పంగాల్, జైస్మైన్ లాంబోరియా, సాగర్ అహ్లావత్, రోహిత్ టోకాస్‌లు మెడల్స్‌ను ఖాయం చేశారు. మెన్స్ హాకీ టీమ్ అయితే టేబుల్లో టాప్ ప్లేస్‌తో సెమీస్ చేరింది. అటు బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ కూడా రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టారు.
ట్రెండింగ్ వార్తలు
ఓవరాల్‌గా ఏడో రోజు ఇండియాకు బాగా కలిసి వచ్చింది. ఇక 8వ రోజు అందరి కళ్లూ రెజ్లర్లపైనే ఉన్నాయి. ముఖ్యంగా వినేష్ ఫోగాట్, బజ్‌రంగ్ పూనియాలు ఏం చేస్తారో అని దేశమంతా ఆసక్తిగా చూస్తోంది. అటు వుమెన్స్ హాకీ టీమ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఫైట్‌కు సిద్ధమైంది. 8వ రోజు ఇండియా మొత్తం షెడ్యూల్ ఒకసారి చూద్దాం.
అథ్లెటిక్స్
వుమెన్స్ 100 మీ. హర్డిల్స్ రౌండ్ 1 హీట్ 2 - జ్యోతి యర్రాజి (మధ్యాహ్నం 3.06)
వుమెన్స్ లాంగ్ జంప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్ ఎ - ఆన్సీ సోజన్ ఎడప్పిల్లి (సాయంత్రం 4.10)
మెన్స్ 4x400 మీ. రిలే రౌండ్ 1 హీట్ 2: సాయంత్రం 4.19
వుమెన్స్ 200 మీ. సెమీఫైనల్ 2- హిమదాస్ (అర్ధరాత్రి 12.53)
టేబుల్ టెన్నిస్
మిక్స్‌డ్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 2 నుంచి) - సత్యన్ జ్ఞానశేఖరన్/మనికా బాత్రా, శరత్ కమల్/ఆకుల శ్రీజ
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 3.15 నుంచి) - రీత్ టెన్నిసన్, శ్రీజా ఆకుల, మనికా బాత్రా
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (మధ్యాహ్నం 3.55 నుంచి) - హర్మీత్ దేశాయ్/సనీల్ శెట్టి
వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16 (సాయంత్రం 4.30 నుంచి) - మనికా బాత్రా/దియా పరాగ్, ఆకుల శ్రీజ/రీత్ టెన్నిసన్
మెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 - శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్, సనీల్ శెట్టి
బ్యాడ్మింటన్ (మధ్యాహ్నం 3.30 నుంచి)
వుమెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16: జాలీ ట్రీసా/పుల్లెల గాయత్రి గోపీచంద్
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16: సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16: పీవీ సింధు
వుమెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16: ఆకర్షి కశ్యప్
మెన్స్ సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16: కిదాంబి శ్రీకాంత్
లాన్ బౌల్స్
వుమెన్స్ పెయిర్ క్వార్టర్‌ఫైనల్స్: ఇండియా vs ఇంగ్లండ్ - మధ్యాహ్నం 1
స్క్వాష్
మెన్స్ డబుల్స్ రౌండ్ ఆఫ్ 16: వేలవన్ సెంథిల్‌కుమార్/అభయ్ సింగ్ - సాయంత్రం 5.15
మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్: దీపికా పల్లికల్/సౌరవ్ ఘోషల్ - అర్ధరాత్రి 12 గంటలకు
హాకీ
వుమెన్స్ సెమీఫైనల్: ఇండియా vs ఆస్ట్రేలియా - రాత్రి 10.30
రెజ్లింగ్ (మధ్యాహ్నం 3.30 నుంచి)
మెన్స్ ఫ్రీస్టైల్ 125 కేజీ: మోహిత్ గ్రేవాల్
మెన్స్ ఫ్రీస్టైల్ 65 కేజీ: బజరంగ్ పూనియా
మెన్స్ ఫ్రీస్టైల్ 86 కేజీ: దీపక్ పూనియా
వుమెన్స్ ఫ్రీస్టైల్ 57 కేజీ: అన్షు మాలిక్
వుమెన్స్ ఫ్రీస్టైల్ 68 కేజీ: దివ్యా కాక్రన్
వుమెన్స్ ఫ్రీస్టైల్ 62 కేజీ: సాక్షి మాలిక్
సంబంధిత కథనం