Saba Karim on Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా తన ఆటిట్యూడ్‌ మార్చుకోవాలి: సబా కరీమ్‌-saba karim on hardik pandya says he should focus on his attitude ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Saba Karim On Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా తన ఆటిట్యూడ్‌ మార్చుకోవాలి: సబా కరీమ్‌

Saba Karim on Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా తన ఆటిట్యూడ్‌ మార్చుకోవాలి: సబా కరీమ్‌

Hari Prasad S HT Telugu
Jan 05, 2023 11:37 AM IST

Saba Karim on Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా తన ఆటిట్యూడ్‌ మార్చుకోవాలని మాజీ వికెట్ కీపర్‌ సబా కరీమ్‌ అనడం విశేషం. శ్రీలంకతో రెండో టీ20కి ముందు కెప్టెన్‌ హార్దిక్‌కు కొన్ని కీలకమైన సూచనలు చేశాడు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా (PTI)

Saba Karim on Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటన్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత గొప్ప కెప్టెన్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఇండియన్‌ టీమ్‌ కెప్టెన్సీ తరచూ అతనికి దక్కుతూనే ఉంది. ఇప్పుడు శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కూడా హర్దికే కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కెప్టెన్‌గా హార్దిక్‌ తన ఆటిట్యూడ్‌పై దృష్టిసారించాలని మాజీ వికెట్‌ కీపర్‌ సబా కరీమ్‌ చెప్పడం గమనార్హం.

ఓ కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ఎన్నో ఎమోషన్లను చూపించడం వల్ల ప్లేయర్స్‌ భయపడే అవకాశం ఉన్నదని కరీమ్‌ అన్నాడు. అతడు తన ప్లేయర్స్‌ను విశ్వసించాలని కూడా చెప్పాడు. "అతడు తన ఆటిట్యూడ్‌పై దృష్టి సారించాలని నేను అనుకుంటున్నాను. ఆ ఆటిట్యూడ్‌ వల్లే ఓ ప్లేయర్‌గా అతన్ని అందరూ ఇష్టపడతారు.

కానీ ఓ కెప్టెన్‌గా ఫీల్డ్‌లో ఎన్నో ఎమోషన్లు చూపించడం వల్ల ప్లేయర్స్‌ భయపడతారు. ఓ టీమ్‌ పురోగతి సాధించాలని ఇది సరికాదు. ప్లేయర్స్‌ను కచ్చితంగా నమ్మాలి" అని కరీమ్‌ సూచించాడు.

అయితే అదే సమయంలో కెప్టెన్‌ హార్దిక్‌లో నచ్చిన రెండు విషయాలను కూడా కరీమ్‌ చెప్పాడు. "కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా విషయంలో నాకు రెండు విషయాలు నచ్చాయి. టాస్‌తో సంబంధం లేకుండా తాను బ్యాటింగ్‌ చేయాలని అనుకున్నట్లు చెప్పాడు.

అంటే ముందున్న సవాళ్ల గురించి అతనికి తెలుసు. ద్వైపాక్షిక మ్యాచ్‌లను పక్కన పెట్టండి. కానీ ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓ కఠినమైన పరిస్థితిని టీమ్‌ ఎదుర్కోవాలి" అని కరీమ్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక శివమ్‌ మావిని పాండ్యా హ్యాండిల్‌ చేసిన విధానం కూడా తనకు నచ్చిందని తెలిపాడు. శివమ్‌ మావిని పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయించడం ద్వారా ఓ కెప్టెన్‌గా తాను ముందుండి టీమ్‌ను ఎలా నడపాలన్న విషయాన్ని చెప్పాడని కరీమ్‌ అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం