OTT Releases | ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కానున్న సినిమాలు ఇవే-new ott releases this week in telugu tamil and hindi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Releases | ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కానున్న సినిమాలు ఇవే

OTT Releases | ఈ వారం ఓటీటీ, థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కానున్న సినిమాలు ఇవే

Nelki Naresh HT Telugu
Apr 21, 2022 10:37 AM IST

కేజీఎఫ్‌-2 జోరు కార‌ణంగా ఈ వారం థియేట‌ర్ల‌లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కావ‌డం లేదు. ఏప్రిల్ 22న రావాల్సిన కొన్ని తెలుగు సినిమాలు వాయిదాప‌డ్డాయి. థియేట‌ర్ల‌లో చిన్న సినిమాలే సంద‌డి చేయ‌బోతున్నాయి. ఓటీటీల‌లో భిన్న క‌థాంశాల‌తో కూడిన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవంటే...

వ‌రుణ్ తేజ్ గ‌ని
వ‌రుణ్ తేజ్ గ‌ని (twitter)

గ‌ని-ఆహా

వరుణ్ తేజ్, స‌యీ మంజ్రేక‌ర్ జంట‌గా నటించిన గని చిత్రం ఆహా ఓటీటీ ద్వారా ఏప్రిల్ 22న రిలీజ్ కానుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌కు ఫ్యామిలీ ఎమోష‌న్స్ మేళ‌వించి రూపొందిన ఈ చిత్రానికి కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఉపేంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌శెట్టి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ఓ మై డాగ్-అమెజాన్ ప్రైమ్‌

తమిళ హీరో అరుణ్ విజయ్ అతడి తనయుడు అర్నవ్ విజయ్ తొలిసారి క‌లిసి న‌టించిన ఓ మై డాగ్ సినిమా ఏప్రిల్ 21న (నేడు) అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. సరవ‌ శణ్ముగం దర్శకత్వం వహించారు. ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది.

అంత్యాక్ష‌రి-సోనిలివ్‌

ప్రియాంక నాయర్, సైజూ కురుప్, సుధీ కొప్ప కీల‌క‌ పాత్రలను పోషించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం అంత్యాక్షరి ఈ వారమే ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల్ని అలరించబోతున్నది. ఏప్రిల్ 22 నుంచి సోనిలివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది.

అనంతం-జీ5

తమిళ వెబ్ సిరీస్ అనంతం జీ5 ఓటీటీ యాప్ ద్వారా ఏప్రిల్ 22న రిలీజ్ కానుంది. ప్రకాష్ రాజ్, సంపత్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలను పోషించారు. ఓ ఇంటి నేప‌థ్యంలో ఫ్యామిలీ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. మ‌ణిర‌త్నం శిష్యురాలు ప్రియ ఈ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

థియేట‌ర్ల‌లో రిలీజ్ కానున్న సినిమాలు

షాహిద్‌క‌పూర్- జెర్సీ

షాహిద్ కపూర్ హీరోగా నటించిన బాలీవుడ్ చిత్రం జెర్సీ చిత్రం ఈ శుక్రవారమే(ఏప్రిల్ 22) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. టాలీవుడ్ చిత్రం జెర్సీ ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మాతృక‌ను డైరెక్ట్ చేసిన గౌత‌మ్‌ తిన్ననూరి హిందీ రీమేక్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టారు. దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ తో కలిసి అమన్ గిల్ ఈ సినిమాను నిర్మించారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది.

1996 ధ‌ర్మ‌పురి

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సమర్పణలో రూపొందిన తెలుగు చిత్ర ధర్మపురి ఏప్రిల్ 22న రిలీజ్ కానుంది. గగన్ విహారి, అపర్ణ జంటగా నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి జగత్ దర్శకత్వం వహించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్