Thomas Cup | చరిత్ర సృష్టించారు.. తొలిసారి ఇండియన్ మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్‌కు గోల్డ్
ఇండియన్ మెన్స్ బ్యాడ్మింటన్ టీమ్ చరిత్ర సృష్టించింది. 14సార్లు ఛాంపియన్ టీమ్ అయిన ఇండోనేషియాను చిత్తుచేసి తొలిసారి థామస్ కప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది.
బ్యాంకాక్: భారత యువ షట్లర్లు అద్భుతమే చేశారు. నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. థామస్ కప్‌లో తొలిసారి గోల్డ్ మెడల్ సాధించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండోనేషియా టీమ్‌పై 3-0తో గెలిచింది ఇండియన్ మెన్స్ టీమ్. కిదాంబి శ్రీకాంత్ 21-15, 23-21 తేడాతో జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించడంతో ఇండియన్ టీమ్ చరిత్ర సృష్టించింది.
ఫైనల్లో ఒక్క మ్యాచూ ఓడకుండానే గోల్డ్ గెలవడం విశేషం. అంతకుముందు తొలి సింగిల్స్‌లో లక్ష్యసేన్ 8-21, 21-17, 21-16 తేడాతో ఆంథోనీ గింటింగ్‌ను ఓడించాడు. తొలి గేమ్‌లో ఓడినా... తర్వాత అద్భుతంగా పుంజుకున్న లక్ష్యసేన్.. తర్వాతి రెండు గేమ్స్‌లో పోరాడి గెలిచాడు. దీంతో ఇండియన్ టీమ్‌కు 1-0 ఆధిక్యం లభించింది.
ఇక ఆ తర్వాత జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కూడా మూడు గేమ్స్పాటు పోరాడి విజయం సాధించింది. ఇండోనేషియా జోడీ మహ్మద్ ఎహసాన్, కెవిన్ సంజయపై 18-21, 23-21, 21-19 తేడాతో భారత జోడీ గెలిచింది. దీంతో టీమ్‌కు కీలకమైన 2-0 లీడ్ లభించింది. ఇక మూడో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్.. మిగిలిపోయిన పని పూర్తి చేశాడు. వరుస గేమ్స్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసి ఇండియన్ టీమ్‌కు 3-0తో గోల్డ్ మెడల్ సాధించిపెట్టాడు.
టాపిక్