Golden Boot Race in Fifa 2022: మెస్సీ వ‌ర్సెస్ ఎంబాపే - గోల్డెన్ బూట్ విజేత ఎవ‌రు?-fifa world cup 2022 messi vs mbappe who will win golden boot award in fifa world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Golden Boot Race In Fifa 2022: మెస్సీ వ‌ర్సెస్ ఎంబాపే - గోల్డెన్ బూట్ విజేత ఎవ‌రు?

Golden Boot Race in Fifa 2022: మెస్సీ వ‌ర్సెస్ ఎంబాపే - గోల్డెన్ బూట్ విజేత ఎవ‌రు?

Nelki Naresh Kumar HT Telugu
Dec 17, 2022 09:24 AM IST

Golden Boot Race in Fifa 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2022లో గోల్డెన్ బూట్ అవార్డ్ ఎవ‌రు గెలుస్తార‌న్న‌ది ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ అవార్డు కోసం అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఆట‌గాడు ఎంబాపే మ‌ధ్య పోటీ నెల‌కొంది.

మెస్సీ
మెస్సీ

Golden Boot Race in Fifa 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ టైటిల్ గెలిచేది ఎవ‌ర‌న్న‌ది ఆదివారం తేల‌నుంది. అర్జెంటీనా, ఫ్రాన్స్ మ‌ధ్య ఫైన‌ల్ ఫైట్ జ‌రుగ‌నుంది. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక గోల్స్‌తో గోల్డెన్ బూట్ అవార్డ్ ఎవ‌రు గెలుస్తారో అని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయ‌ర్ మెస్సీ ఐదు గోల్స్ చేశాడు. అత‌డితో పాటు ఫ్రాన్స్ ప్లేయ‌ర్ ఎంబాపే ఐదు గోల్స్‌తో మెస్సీతో స‌మానంగా టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు గోల్డెన్ బూట్ ద‌క్కించుకుంటార‌న్న‌ది ఫైన‌ల్ ఫైట్‌లో తేల‌నుంది. వీరి త‌ర్వాత నాలుగు గోల్స్‌తో జూలియ‌న్ అల్వ‌రెజ్ (అర్జెంటీనా), ఒలివ‌ర్ గెరాడ్ (ఫ్రాన్స్‌) సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. గోల్డెన్ బూట్‌లో మెస్సీ, ఎంబాపే ఇద్ద‌రు స‌మంగా నిలిస్తే ఔట్‌ఫీల్డ్ గోల్స్ ద్వారా గోల్డెన్ బూట్ విన్న‌ర్‌ను ప్ర‌క‌టిస్తారు. ఈ ప్ర‌కారం చూసుకుంటే ఎంబాపే గెలిచే అవ‌కాశం ఉంటుంది.

మెస్సీ చేసిన గోల్స్ ఎక్కువ‌గా పెనాల్టీల ద్వారా వ‌చ్చాయి. అర్జెంటీనా త‌ర‌ఫున లియోనాల్ మెస్సీ కి ఫైన‌ల్ చివ‌రి మ్యాచ్ కావ‌డంతో ఫ్రాన్స్‌పై గెలిచి ఘ‌నంగా కెరీర్‌ను ముగించే ఆలోచ‌న‌లో ఉన్నాడు. అర్జెంటీనా ఫైన‌ల్ చేరుకోవ‌డం ఇది ఆరోసారి. ఇందులో మూడు సార్లు విజేత‌గా నిల‌వ‌గా రెండు సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. మ‌రోవైపు డిఫెండింగ్ ఛాంపియ‌న్‌గా ఫ్రాన్స్ బ‌రిలో దిగుతోంది. వ‌రుస‌గా రెండోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాల‌ని ఉత్సాహంతో ఉంది.

WhatsApp channel