Sebastian Vettel: వెటెల్ రిటైర్మెంట్.. ఆస్టన్ మార్టిన్‌తో చేరనున్న అలోన్సో
Sebastian Vettel: ఫార్ములా వన్ డ్రైవర్, నాలుగుసార్లు వరల్డ్ ఛాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్ ముగిసిన తర్వాత రిటైరవుతున్నట్లు ప్రకటించిన విషయం తెలుసు కదా. అతని స్థానంలో కొత్త డ్రైవర్ ఆస్టన్ మార్టిన్ టీమ్‌లో చేరనున్నాడు.

న్యూఢిల్లీ: రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ ఫెర్నాండో అలోన్సో ఎఫ్1 టీమ్ ఆస్టన్ మార్టిన్ టీమ్‌లో చేరనున్నాడు. వచ్చే సీజన్ నుంచి అతడు రిటైరవుతున్న సెబాస్టియన్ వెటెల్ స్థానంలో ఆ టీమ్‌లోకి వెళ్లనున్నాడు. మరోవైపు ప్రస్తుతం ఆల్పైన్ టీమ్‌తో ఉన్న అలోన్సో కాంట్రాక్ట్ ఈ సీజన్‌తో ముగుస్తోంది. దీంతో అతనితో కొన్నేళ్ల డీల్‌ను కుదుర్చుకున్నట్లు సోమవారం (ఆగస్ట్ 1) ఆస్టన్ మార్టిన్ టీమ్ ప్రకటించింది.
"ఆస్టన్ మార్టిన్ టీమ్‌తో చేరనుండటం సంతోషంగా ఉంది. గెలుపు కోసం నిబద్ధతతో పని చేస్తున్న, మంచి విజన్ ఉన్న టీమ్ ఆస్టన్ మార్టిన్" అని అలోన్సో అన్నాడు. 41 ఏళ్ల అలోన్సో ఎఫ్1లో తన 20వ సీజన్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం. రెనాల్ట్ తరఫున తొలిసారి 2005, ఆ తర్వాత 2006లో వరల్డ్ టైటిల్స్ గెలిచాడు అలోన్సో. 2019, 2020 సీజన్‌లలో అతడు ఏ రేసులోనూ పార్టిసిపేట్ చేయలేదు.
ఆస్టన్ మార్టిన్ టీమ్ తరఫున లారెన్స్ స్ట్రోల్ మరో డ్రైవర్‌గా ఉన్నాడు. ఇతడు ఆ టీమ్ ఓనర్ కొడుకే కావడం విశేషం. ఈ సీజన్‌లో టాప్ టెన్ కన్‌స్ట్రక్టర్స్ టేబుల్లో లారెన్స్ స్ట్రోల్ 9వ స్థానంలో ఉన్నాడు. అటు ప్రస్తుతం అలోన్సో 20 మంది డ్రైవర్ల లిస్ట్‌లో 10వ స్థానంలో ఉన్నాడు. అతని ప్రస్తుత టీమ్ అల్పైన్ నాలుగోస్థానంలో కొనసాగుతోంది.
సంబంధిత కథనం