కర్కాటక రాశి
(June - July)కర్కాటక రాశి ఫలాలు (పునర్వసు 4వ పాదం: పుష్యమి: ఆశ్లేష):
గురు గ్రహం ప్రభావం:
మే 14, 2025 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఈ సమయంలో అన్ని పనులలో విజయం, సౌఖ్యం, శత్రు బాధలు లేకపోవడం, శుభవార్తలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మే 15, 2025 నుండి అక్టోబర్ 19, 2025 వరకు, డిసెంబర్ 6, 2025 నుండి సంవత్సరాంతం వరకు మిథున రాశిలో ఉంటాడు. ఈ సమయంలో ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి, స్థానచలనం, శుభకార్యాల మూలంగా ధన వ్యయం, ప్రయాణాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి.
అక్టోబర్ 20, 2025 నుండి డిసెంబర్ 5, 2025 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ సమయంలో వృత్తి, ఉద్యోగాలలో ఆలస్యం, ధన నష్టం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆపదలు, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే అవకాశాలు ఉంటాయి.
శని గ్రహం ప్రభావం:
సంవత్సరమంతా మీన రాశిలో ఉంటాడు. దీనివల్ల మానసిక ఆందోళన, ఆరోగ్యంపై శ్రద్ధ, పనులు ఆలస్యం కావడం, చెడు పనులకు దూరంగా ఉండటం, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
రాహు-కేతు గ్రహాల ప్రభావం:
రాహువు:
మే 18, 2025 వరకు మీన రాశిలో ఉండి, పనులకు ఆటంకాలు, స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు, మోసపోయే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు, ప్రయాణాలు ఉంటాయి. తర్వాత కుంభ రాశిలో మానసిక ఆందోళన తొలగుతుంది, ఆరోగ్యంపై శ్రద్ధ, భయం దూరమవుతుంది, ప్రయాణాలలో మెలకువ అవసరం, పనులలో ఇబ్బందులు, విదేశీ ప్రయాణాలు ఆలస్యం అవుతాయి.
కేతువు:
మే 18, 2025 వరకు కన్య రాశిలో ఉంటాడు. నూతన వ్యక్తులను నమ్మరాదు, అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడాలి, ప్రయత్న కార్యాలకు ఆటంకాలు, దైవ దర్శనం, ఋణ ప్రయత్నాలు ఆలస్యం కావడం, సోదర వైరం ఉంటాయి. తర్వాత సింహ రాశిలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి, ధనలాభం, ఋణ బాధలు తొలగుతాయి, సమాజంలో మంచి పేరు, ఆదర్శంగా నిలవడం, స్త్రీలు, బంధుమిత్రులతో కలయికలు ఉంటాయి.