Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. గురు రాహువుల ప్రభావంతో వీరికి ఘర్షణ ఎదురవుతుంది-today horoscope in telugu for monday 25th september 2023 check your zodiac sign for astrological predictions ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Today Horoscope In Telugu For Monday 25th September 2023 Check Your Zodiac Sign For Astrological Predictions

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు.. గురు రాహువుల ప్రభావంతో వీరికి ఘర్షణ ఎదురవుతుంది

HT Telugu Desk HT Telugu
Sep 25, 2023 01:00 AM IST

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.09.2023 సోమవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.09.2023
Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 25.09.2023 (pixabay)

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 25.09.2023

ట్రెండింగ్ వార్తలు

వారం: సోమవారం, తిథి: ఏకాదశి,

నక్షత్రం : ఉత్తరాషాఢ, మాసం: భాద్రపదం,

సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశిలో గురు, రాహువుల ప్రభావం, కళత్ర స్థానములో కేతువు ప్రభావం చేత చేసే పనులలో కొంత ఇబ్బందులు, ఒత్తిళ్ళు కలుగును. సకాలంలో పనులు పూర్తి కాలేని పరిస్థితి. చంద్రుని ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకు, స్త్రీలకు చెడు సమయం. మేషరాశి వారు ఈరోజు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివాష్టకం పఠించడం మంచిది. శివుడికి చెరుకురసంతో అభిషేకం చేయడం వలన ఉన్నత పదవులు మరియు ధనమును పొందెదరు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. తృతీయంలో శుక్రుడు, చతుర్ధంలో బుధుడు, పంచమంలో కుజ, రవిల అనుకూల స్థితి వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చే రోజు. చంద్రుని ప్రభావం వలన మీరు చేసే పనులు సత్‌ ఫలితాలిస్తాయి. వ్యాపారస్తులకు ఆర్ధికపరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం లభించును. వృషభరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శివుడిని పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం మంచిది. పంచాక్షరీ మంత్రంతో 108 సార్లు శివనామస్మరణ చేయడం శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మీకు చంద్రుని ప్రభావం వలన అంత అనుకూలంగా లేదు. శత్రుబాధ అధికం. మీరు చేసే పనుల్లో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మిథునరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివుడిని తేనెతో అభిషేకం చేయడం మంచిది. శివాష్టకం పఠించండి. గోవులకు అరటిపళ్ళు తినిపించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అష్టమశని ప్రభావం, అలాగే చంద్రుని ప్రభావం, మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలు కలుగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు కలసివచ్చును. కర్కాటక రాశి వారికి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివారాధన మరియు పంచాక్షరీ జపం వలన శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. చంద్రుని యొక్క అనుకూల ప్రభావం, వ్యయస్థానములో శుక్రుని ప్రభావం, కళత్ర స్థానములో శని, కుజ, రాహువుల ప్రభావం మీరు చేసే పనులు సత్ఫ్భలితాలిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాక్‌ స్థానములో రవి, బుధుల ప్రభావం వలన గొడవల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సింహరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. లాభ స్థానములో శుక్రుడు, వ్యయస్థానములో బుధుడు ప్రభావం వలన అలాగే జన్మస్థానములో రవి ప్రభావం చేత కొంత ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు లాభదాయకం. ధనపరమైనటువంటి సమస్యలు తొలగును. వృత్తి, ఉద్యోగపరంగా కలసివచ్చును. కన్యారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కేతువు, సప్తమంలో గురు రాహువుల ప్రభావం పంచమస్థానములో శని అనుకూల స్థితివలన వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు అనుకూలం. వ్యాపారస్తులకు లాభదాయకం. ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. తులారాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకం పఠించండి. ఈశ్వరుణ్ణి పళ్ళ రసాలతో అభిషేకం చేయడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. అర్ధాష్టమ శని ప్రభావం వలన పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. మీరు చేసే పనుల్లో ఇబ్బందులు, చికాకులు కలుగును. అనారోగ్య సమస్యలు వేధించును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన మీయొక్క కృషితో పట్టుదలతో అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు మధ్యస్థం. వ్యాపారస్తులకు అనుకూలం. విద్యార్థులకు కష్టపడవలసిన సమయం. వృశ్చికరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే పంచాక్షరీ మంత్రంతో 18 సార్లు శివనామస్మరణ చేయాలి. శివ అష్టోత్తర శతనామావళి పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. చతుర్ధంలో శని అనుకూల ప్రభావం, పంచమంలో గురు రాహువుల అనుకూల ప్రభావం అలాగే శుక్రుడు, రవి, బుధుని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కలసివచ్చును. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ప్రయాణాలు కలసివచ్చును. విద్యార్థులకు అనుకూలం. ధనూరాశివారికి మరింత శుభఫలితాలు కలగాలంటే శివాష్టకాన్ని పఠించండి. బిల్వాష్టకము పఠించి శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని అంత్యభాగములో ఉన్నప్పటికి భాగ్యములో రవి కుజుల అనుకూల స్థితి, కళత్రస్థానములో శుక్రుని ప్రభావం చతుర్ధ స్థానములో గరు, రాహువుల అనుకూల స్థితి వలన కుటుంబముతో అనందముగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం మంచిది. శివ అప్టోతర శతనామావళి పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మశని, ఏలినాటి శని ప్రభావం, గురు, రాహువులు అనుకూలంగా లేకపోవడం వలన అష్టమస్థానములో రవి ప్రభావంచేత కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు వేధించును. చేసే పనుల్లో ఇబ్బందులు కలుగును. వృత్తి ఉద్యోగపరంగా జాగ్రత్తలు వహించాలి. కుంభరాశి వారికి మరింత శుభఫలితాలు కలగాలంటే బిల్వాష్టకం పఠించండి. విశ్వనాథాష్టకం పఠించండి. పంచామృతాలతో శివుడిని అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా కొంత ఇబ్బందులు కలుగును. ఏలినాటి శని ప్రభావం అలాగే వాక్‌ స్థానములో గురు, రాహువుల ప్రభావం వలన ఘర్షణలకు, రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ మరియు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదు. మీనరాశి వారు మరింత శుభఫలితాలు పొందడానికి బిల్వ పత్రాలతో శివ అష్టోత్తర శతనామావళితో ఈశ్వరుణ్ణి పూజించండి. విశ్వనాథాష్టకం పఠించండి.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

WhatsApp channel