గురు ఛండాల యోగం సమాప్తం.. వీరికి ఇక శుభ ఫలితాలే
గురు ఛండాల యోగం సమాప్తం అవ్వడం చేత నవంబర్ నుంచి ఏయే రాశులవారికి శుభఫలితాలు కలుగుతాయి? చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వివరాలు ఇవీ.
చిలకమర్తి పంచాంగరీత్యా, దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేష రాశిలో గురునితో కలసి ఉన్నటువంటి రాహువు 30 అక్టోబర్ 2023న మీనరాశిలోనికి మారుచున్నాడని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. గురు, రాహువులు మేషరాశిలో కలసి ఉండగా ఏర్పడిన గురు ఛండాల యోగం అక్టోబర్ నెలాఖరుకు పూర్తి అవుతుందని చిలకమర్తి తెలిపారు.
ఈ గురు ఛండాల యోగం పరిసమాప్తి చెందటం వలన రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచరించడం చేత గోచారపరంగా మేష మరియు తులా రాశుల వారికి శుభఫలితాలు కలుగుబోతున్నాయని చిలకమర్తి తెలిపారు.
గురు ఛండాల యోగ ప్రభావం పూర్తగుటచేత వృషభ, మిథున, కర్కాటక రాశుల వారికి వృశ్చిక, ధనస్సు, మకరరాశుల వారికి మధ్యస్థం నుండి శుభఫలితాలు కలగబోతున్నాయని చిలకమర్తి తెలిపారు.
సింహ, కన్యా, కుంభ, మీన రాశుల వారికి రాహు కేతువుల యొక్క మార్చుల వలన ఒత్తిళ్ళు, సమస్యలతో కూడియున్నటువంటి గ్రహస్థితి కలుగుతుందని చిలకమర్తి తెలియచేశారు.
మొత్తం మీద గురు ఛండాలయోగం పూర్తి అవ్వడం చేత ఒంటరిగా వున్న గురుడు పూర్తి స్థాయిలో శుభఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ పరిణామం పైన చెప్పిన విధంగా పలు రాశుల జాతకులకు శుభ ఫలితాలు కలుగుతాయని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.