Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : గొడవలకు దూరంగా ఉండండి.. శుభఫలితాల కోసం శివారాధన చేయండి-today horoscope in telugu based on career and life for 24th september 2022 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : గొడవలకు దూరంగా ఉండండి.. శుభఫలితాల కోసం శివారాధన చేయండి

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు : గొడవలకు దూరంగా ఉండండి.. శుభఫలితాల కోసం శివారాధన చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 24, 2022 05:00 AM IST

Today Horoscope : నేటి రాశిఫలాలు : రోజువారీ జాతకంలో మీకు రాశులు అనుకూలంగా ఉన్నాయా? సెప్టెంబర్ 24వ తేదీ 2022న కెరీర్​ పరంగా, డబ్బుల పరంగా మీకు రాశులు అనువుగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం. చంద్రమానం ప్రకారం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.

<p>నేటి రాశిఫలాలు</p>
నేటి రాశిఫలాలు

Today Rasi Phalalu : నేటి రాశిఫలాలు (24-09-2022) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

yearly horoscope entry point

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేస్తారు. ఖర్చులు అధికముగా ఉంటాయి. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. విభేదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయండి.

వృషభరాశి

ఈరోజు మీకు మధ్యస్థముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శారీరక శ్రమ కొంత అధికముగా, మానసిక అలసట ఉంటుంది. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించండి.

మిధునరాశి

ఈరోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఏలినాటి శని ప్రభావం చేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అధికముగా ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు, వ్యాపారస్తులకు ధన విషయములో ఇబ్బందులు ఉంటాయి. కుటుంబములో కొంత ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణమునందు ఖర్చులు అధికమగుతాయి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.

కర్కాటకరాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఉత్సాహముతో ముందుకు సాగెదరు. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబము సమస్యలు తగ్గుతాయి. నూతనంగా ప్రారంభించే వ్యవహారాలలో ఆచితూచి ముందుకు వెళ్లండి. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

సింహరాశి

ఈరోజు మీకు అనుకూలంగా లేదు. చేసే ప్రతీ పనిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు ఎక్కువగా ఉంటాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వ్యాపారస్తులకు ఇబ్బందికరంగా ఉంటుంది. శుభ ఫలితాలు పొందడం కోసం శివరాధన చేయడం మంచిది.

కన్యారాశి

ఈరోజు మీకు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు అధికముగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యం దొరుకుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం మంచిది. శత్రువులపై విజయము సాధిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

తులా రాశి

ఈరోజు మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నది. కుటుంబముతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రయాణములు అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సంతానము వలన సంతోషము ఉంటుంది. అప్పుల ఒత్తిడి ఉంటుంది. మిత్రుల ద్వారా సహాయము పొందుతారు. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

వృశ్చిక రాశి

ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ఇష్టమైన వస్తువులు కొంటారు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము ఉంటుంది. సోదరులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికముగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా వ్యవహరిస్తారు. దుర్గాష్టకము, దుర్గా కవచము పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును.

ధనూ రాశి

ఈరోజు మీకు అనుకూలముగా ఉంటుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. సమస్యలు పరిష్కారామవుతాయి. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఇది. వ్యాపారస్తులకు చికాకులు ఉంటాయి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

మకర రాశి

ఈరోజు మీకు మధ్యస్తముగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త. చికాకులు అధికముగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ.. జాగ్రత్తగా చేయండి. శివాష్టకం, దుర్గాష్టకం పారాయణం చేయడం మంచిది. నువ్వులనూనెతో దీపారాధన చేయాలి.

కుంభ రాశి

ఈరోజు మీకు మధ్యస్థము నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నవి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రముగా ఉంది. కాబట్టి ప్రతీ పనిని ఆచితూచి చేయండి. శత్రువుల వల్ల బాధలు అధికమవుతాయి. ఉద్యోగంలో సమస్యలు అధికముగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి.

మీన రాశి

ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

Contact : 9494981000

Whats_app_banner

సంబంధిత కథనం