Simha Rasi Today: సింహ రాశి వారికి ఈరోజు మాజీ లవర్‌తో చిక్కులు, ఆఫీస్‌కి త్వరగా వెళ్లండి-simha rasi phalalu today 26th august 2024 check your leo zodiac sign horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Simha Rasi Today: సింహ రాశి వారికి ఈరోజు మాజీ లవర్‌తో చిక్కులు, ఆఫీస్‌కి త్వరగా వెళ్లండి

Simha Rasi Today: సింహ రాశి వారికి ఈరోజు మాజీ లవర్‌తో చిక్కులు, ఆఫీస్‌కి త్వరగా వెళ్లండి

Galeti Rajendra HT Telugu
Aug 26, 2024 05:29 AM IST

Leo Horoscope Today: రాశి చక్రంలో 5వ రాశి సింహ రాశి. పుట్టిన సమయంలో సింహ రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని సింహ రాశిగా పరిగణిస్తారు. ఈరోజు సింహ రాశి జాతకుల కెరీర్, ఆరోగ్య, ఆర్థిక, ప్రేమ జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

సింహ రాశి
సింహ రాశి (Pixabay)

Simha Rasi Phalalu Today 26th August 2024: సింహ రాశి వారు ఈరోజు ప్రేమ విషయంలో భాగస్వామితో వాదించొద్దు. మీ భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి. వృత్తిపరమైన సవాళ్లను చిరునవ్వుతో పరిష్కరించండి. ఈరోజు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది.

ప్రేమ

ఈ రోజు ప్రేమ పరంగా పెద్దగా సమస్యలు ఉండవు. కలిసి ఎక్కువ సమయం గడపండి, కానీ అనవసరమైన సంభాషణలకు దూరంగా ఉండండి, ఇది మీ భాగస్వామికి చికాకు కలిగిస్తుంది. మీ ప్రేమికుడి అభిప్రాయానికి విలువ ఇవ్వండి. ఇది బంధాన్ని బలోపేతం చేస్తుంది.

కొంతమంది సింహ రాశి జాతకులు ఈ రోజు రొమాంటిక్ డిన్నర్‌తో సంతోషంగా ఉంటారు. సర్‌ప్రైజ్ బహుమతులు కూడా ఈ రోజు బంధంలో మార్పులను తెస్తాయి. వివాహిత స్త్రీలు తమ మాజీ ప్రియుడికి దూరంగా ఉండాలి. ఎందుకంటే కుటుంబ జీవితంలో ఈరోజు ఇది సమస్యలు తీసుకురావొచ్చు.

కెరీర్

ఈ రోజు కొత్త పనిని ప్రారంభించడానికి ఆఫీసుకు త్వరగా వెళ్ళండి. మీరు ఎక్కువ గంటలు పని చేయాల్సి ఉంటుంది. సహోద్యోగులతో వాదనలకు దిగకండి. ఒక సీనియర్ ఈ రోజు మీ మార్గంలో ఇబ్బందులను సృష్టించవచ్చు. బిజినెస్ డెవలపర్లు యాజమాన్యాన్ని మెప్పించడానికి నూతన ఆవిష్కరణలు చేయాలి.

చెఫ్‌లు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, మీడియా సిబ్బంది, సివిల్ ఇంజనీర్లకు ఈ రోజు సాఫీగా సాగిపోతుంది. కొంతమంది ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలను విడిచిపెట్టాలని ఆలోచిస్తారు. రోజు ముగియక ముందే ఇంటర్వ్యూ పొందడం కోసం జాబ్ పోర్టల్‌లో మీ వివరాలను అప్‌డేట్ చేయండి.

ఆర్థిక

ఈ రోజు సింహ రాశి వారు సురక్షితమైన పెట్టుబడి ఎంపికల గురించి ఆలోచిస్తారు. షేర్లు, ట్రేడింగ్, వ్యాపారంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు, కానీ సరైన సలహా, పరిశోధనతో ఆ పని చేయండి. ఈరోజు కుటుంబంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.

కొంతమంది సింహ రాశి జాతకుల తోబుట్టువులు ఆస్తి కోసం దావా వేయవచ్చు. మీరు బకాయి ఉన్న డబ్బును కూడా తిరిగి చెల్లించవచ్చు. కుటుంబ సంబరాలకు సహకరించాల్సిన అవసరం ఉండవచ్చు. కొంతమంది సింహ రాశి వారు మంచి వ్యాపారం చేస్తారు. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిధుల సమీకరణకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది.

ఆరోగ్యం

ఛాతీ లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు ఉన్న సింహ రాశి వారు ఈరోజు ఉదయాన్నే జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. ప్రోటీన్, విటమిన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. మీకు తేలికపాటి తలనొప్పి ఉండవచ్చు. మద్యపానం మానేసి యోగా క్లాసు ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. మీకు తీవ్ర అశాంతిగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి.

Whats_app_banner