తెలుగు న్యూస్ / ఫోటో /
Zainab Abbas vs Babar Azam: జైనాబ్ అబ్బాస్‌కు, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌కు మధ్య గొడవేంటి? వైరల్ అవుతున్న పాత ట్వీట్
- Zainab Abbas vs Babar Azam: పాకిస్థానీ క్రికెట్ ప్రెజంటర్ జైనాబ్ అబ్బాస్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం మధ్య గతంలో వివాదం చెలరేగింది. ఆమె బాబర్ కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ నుంచి ఆమెను పంపించేశారన్న వార్తల నేపథ్యంలో పాత ట్వీట్ తెరపైకి వచ్చింది.
- Zainab Abbas vs Babar Azam: పాకిస్థానీ క్రికెట్ ప్రెజంటర్ జైనాబ్ అబ్బాస్, పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం మధ్య గతంలో వివాదం చెలరేగింది. ఆమె బాబర్ కు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వరల్డ్ కప్ నుంచి ఆమెను పంపించేశారన్న వార్తల నేపథ్యంలో పాత ట్వీట్ తెరపైకి వచ్చింది.
(1 / 5)
Zainab Abbas vs Babar Azam: హిందూ మతానికి వ్యతిరేకంగా అప్పుడెప్పుడో పోస్టులు చేసిందన్న కారణంగా ఇప్పుడు వరల్డ్ కప్ నుంచి జైనాబ్ అబ్బాస్ ను తరిమేశారన్న వార్తల నేపథ్యంలో.. గతంలో ఆమెకు వార్నింగ్ ఇస్తూ బాబర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
(2 / 5)
Zainab Abbas vs Babar Azam: బాబర్ ఆజం టెస్ట్ క్రికెట్ లో తొలి సెంచరీ చేసిన తర్వాత జైనాబ్ అబ్బాస్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీటే బాబర్ ను ఆగ్రహానికి గురి చేసింది. అందులో ఏముందంటే.. "బాబర్ ఆజం బాగా ఆడాడు. తన కొడుకు బాగా ఆడినందుకు ప్లేయర్స్ అందరూ వెళ్లి మిక్కీ ఆర్థర్ కు శుభాకాంక్షలు చెప్పడం బాగుంది" అని జైనాబ్ ట్వీట్ చేసింది.
(3 / 5)
Zainab Abbas vs Babar Azam: జైనాబ్ ట్వీట్ బాబర్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. "ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించు. హద్దు దాటకు" అంటూ కాస్త ఘాటుగానే బాబర్ ఆమెకు వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.
(4 / 5)
Zainab Abbas vs Babar Azam: ఆ తర్వాత జైనాబ్, బాబర్ మధ్య గొడవ కామ్‌గా సద్దుమణిగింది. ఐసీసీ తరఫున ఈ ఏడాది మొదట్లో బాబర్ ఆజంను జైనాబ్ అబ్బాస్ ఇంటర్వ్యూ కూడా చేసింది.
(5 / 5)
Zainab Abbas vs Babar Azam: ఐసీసీ డిజిటల్ టీమ్ తరఫున పని చేస్తున్న జైనాబ్ అబ్బాస్.. పాకిస్థాన్ మ్యాచ్ లు ఆడుతున్న హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఆమె కొన్నేళ్ల కిందట హిందూ దేవతలు, మతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో ఢిల్లీకి చెందిన లాయర్ వినీత్ కేసు వేశారు. దీని కారణంగానే ఆమె ఇండియా విడిచి వెళ్లిందన్న వార్తలు వచ్చినా.. ఐసీసీ మాత్రం ఆమె వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లిపోయిందని చెప్పడం గమనార్హం.
ఇతర గ్యాలరీలు