తెలుగు న్యూస్ / ఫోటో /
Weight Loss Workout । బరువు తగ్గాలంటే ఈ ఒక్క వ్యాయామం చేస్తే చాలు!
- Weight Loss Workout: బరువు తగ్గాలంటే తినే ఆహారంలో మార్పులు చేసుకోవడమే కాదు, రోజూ ఉదయాన్నే జాగింగ్ చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. ఉదయాన్నే లేచి జాగింగ్ చేయాలనిపించకపోతే మరిన్ని మార్గాలు చూడండి.
- Weight Loss Workout: బరువు తగ్గాలంటే తినే ఆహారంలో మార్పులు చేసుకోవడమే కాదు, రోజూ ఉదయాన్నే జాగింగ్ చేస్తే సులభంగా బరువు తగ్గుతారు. ఉదయాన్నే లేచి జాగింగ్ చేయాలనిపించకపోతే మరిన్ని మార్గాలు చూడండి.
(1 / 6)
చాలా మంది బరువు తగ్గాలనుకుంటారు కానీ అందుకోసం వ్యాయామం చేయమంటే మాత్రం వెనకడుగు వేస్తారు. మరి బరువు ఎలా తగ్గాలి? ఇవి ట్రై చేయండి. (Unsplash)
(2 / 6)
ప్రతిరోజూ ఐదు నిమిషాల సాధారణ వ్యాయామంతో బరువు తగ్గవచ్చని మీకు తెలుసా? షాకింగ్ గా ఉంది కాదా! కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్క్వాట్ వ్యాయామాలు సులభంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజూ ఒక్కో వ్యాయామానికి 5 నిమిషాలు చాలు. (Freepik)
(3 / 6)
కుర్చీపై కూర్చున్న భంగిమలో నిలబడాలి. మోకాళ్లను వంచి నడుము, వీపు నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో, రెండు చేతులను విస్తరించాలి. ఇలా రెగ్యులర్ గా ఐదు నిమిషాలు నిలబడితే చాలా వరకు బరువు తగ్గే అవకాశం ఉంది.(Freepik)
(4 / 6)
స్క్వాట్‌లు బరువు తగ్గించడమే కాకుండా నడుము, కాళ్ల కండరాలను కూడా బలోపేతం చేస్తాయి. చాలా మంది బరువు తగ్గడానికి పరుగు లేదా నడకను ఎంచుకుంటారు. బయటకు వెళ్లాలని ఇష్టం లేనపుడు ఇంట్లోనే ఈ స్క్వాట్స్ చేసి కూడా కేలరీలు బర్న్ చేయవచ్చు.(Freepik)
(5 / 6)
ఈ వ్యాయామం హార్మోన్లు , టెస్టోస్టెరాన్ స్రావానికి కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా చేస్తే, శరీర సమతుల్యత కూడా సాధ్యమవుతుంది. ఈ తరహా వ్యాయామాలతో కండరాల ఒత్తిడి లేదా నొప్పి నయమవుతుంది. కీళ్ల నొప్పులను నయం చేయడంలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.(Unsplash)
ఇతర గ్యాలరీలు