తెలుగు న్యూస్ / ఫోటో /
World Cup 2023 Latest Points Table: టీమిండియానే టాపర్.. వరల్డ్ కప్ లేటెస్ట్ పాయింట్స్ టేబుల్ ఇదీ
- World Cup 2023 Latest Points Table: టీమిండియానే వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచింది. సౌతాఫ్రికాపై విజయం తర్వాత 8 మ్యాచ్ లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన ఇండియన్ టీమ్.. చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా టాప్ లోనే ఉండనుంది.
- World Cup 2023 Latest Points Table: టీమిండియానే వరల్డ్ కప్ 2023 పాయింట్ల టేబుల్లో టాప్ లో నిలిచింది. సౌతాఫ్రికాపై విజయం తర్వాత 8 మ్యాచ్ లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించిన ఇండియన్ టీమ్.. చివరి మ్యాచ్ తో సంబంధం లేకుండా టాప్ లోనే ఉండనుంది.
(1 / 10)
World Cup 2023 Latest Points Table: వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ టాప్ లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. వరుసగా 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది టీమిండియా. మరే టీమ్ కి కూడా ఇక 16 పాయింట్లు సాధించే అవకాశమే లేదు. దీంతో చివరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా టాప్ ప్లేస్ తోనే ఇండియా సెమీఫైనల్లో అడుగుపెట్టనుంది. ఇండియా 8 మ్యాచ్ లలో 16 పాయింట్లు, +2.456 నెట్ రన్ రేట్ తో టాప్ లో ఉంది. శ్రీలంకపై 302, సౌతాఫ్రికాపై 243 రన్స్ తేడాతో సాధించిన భారీ విజయాలతో ఇండియా నెట్ రన్ రేట్ ఎంతో మెరుగైంది.
(2 / 10)
World Cup 2023 Latest Points Table: ఇండియా చేతుల్లో భారీ ఓటమితో సౌతాఫ్రికా టేబుల్లో రెండోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 6 గెలిచి, 2 ఓడి 12 పాయింట్లు, 1.367 నెట్ రన్ రేట్ తో రెండోస్థానంలో ఉంది.(AFP)
(3 / 10)
World Cup 2023 Latest Points Table: ఆస్ట్రేలియా 7 మ్యాచ్ లలో 5 గెలిచి, 2 ఓడి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ 0.924గా ఉంది.
(4 / 10)
World Cup 2023 Latest Points Table: వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి ఊపు మీద కనిపించిన న్యూజిలాండ్ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం కివీస్ 8 మ్యాచ్ లలో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లు, 0.398 నెట్ రన్ రేట్ తో నాలుగో స్థానంలో ఉంది.
(5 / 10)
World Cup 2023 Latest Points Table: వరుసగా నాలుగు ఓటములతో సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్లు కనిపించిన పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండు విజయాలతో మళ్లీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ టీమ్ 8 మ్యాచ్ లలో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లు, 0.036 నెట్ రన్ రేట్ తో ఐదో స్థానంలో ఉంది.
(6 / 10)
World Cup 2023 Latest Points Table: ఆఫ్ఘనిస్థాన్ టీమ్ కూడా ఇంకా రేసులో ఉంది. ఆ టీమ్ 7 మ్యాచ్ లలో 4 విజయాలు, 3 ఓటములతో 8 పాయింట్లు, -0.330 నెట్ రన్ రేట్ తో 6వ స్థానంలో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో ఆడాల్సి ఉంది. వీటిలో గెలవడం అంత సులువు కాకపోయినా ఆఫ్ఘన్ టీమ్ ఊపు చూస్తుంటే అసాధ్యమేమీ కాదనిపిస్తోంది.
(7 / 10)
World Cup 2023 Latest Points Table: శ్రీలంక టీమ్ 7 మ్యాచ్ లలో కేవలం 2 విజయాలు, 5 ఓటములతో 4 పాయింట్లు, -1.162 నెట్ రన్ రేట్ తో 7వ స్థానంలో ఉంది. సాంకేతికంగా ఆ టీమ్ కు ఇప్పటికీ అవకాశాలు ఉన్నా.. అది దాదాపు అసాధ్యమనే చెప్పాలి.
(8 / 10)
World Cup 2023 Latest Points Table: ఈ వరల్డ్ కప్ లో రెండు స్ఫూర్తిదాయక విజయాలు సాధించిన నెదర్లాండ్స్ టీమ్ 7 మ్యాచ్ లలో 4 పాయింట్లు, -1.398 నెట్ రన్ రేట్ తో 8వ స్థానంలో ఉంది.
(9 / 10)
World Cup 2023 Latest Points Table: ఈ వరల్డ్ కప్ లో సెమీస్ రేసు నుంచి తప్పుకున్న తొలి టీమ్ బంగ్లాదేశ్ 7 మ్యాచ్ లలో కేవలం ఒకే విజయంతో 2 పాయింట్లు, -1.446 నెట్ రన్ రేట్ తో 9వ స్థానంలో ఉంది.
ఇతర గ్యాలరీలు