Inavolu Mallanna brahmotsavam : కోరమీసాల దేవుడు ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు-భారీగా తరలివస్తున్న భక్తులు
- Inavolu Mallanna brahmotsavam : వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోర్కెలు తీర్చే కోరమీసాల మల్లన్న పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నాయి.
- Inavolu Mallanna brahmotsavam : వరంగల్ జిల్లా ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోర్కెలు తీర్చే కోరమీసాల మల్లన్న పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నాయి.
(1 / 8)
కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల దేవుడు ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినంతోపాటు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.
(2 / 8)
ఐలోని మల్లన్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఆలయానికి వేలాదిమంది తరలివచ్చారు. ఉత్సవాల నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుండే పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాల తో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగులీనుతోంది.
(3 / 8)
ఉత్తర తెలంగాణ ప్రజలు కొంగు బంగారంగా కొలిచే ఐనవోలు మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు సౌకర్యాలను అధికారులు కల్పించారు.
(4 / 8)
ధ్వజారోహనంతో మల్లికార్జున స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఉదయం స్వామివారికి పూజలు మొదలయ్యాయి. ఉదయం నుంచి భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. 14వ తేదీన భోగి, 15వ తేదీన సంక్రాంతి, 16వ తేదీన కనుమ పండుగ నేపథ్యంలో భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలి రానున్నారు. ఈ ఉత్సవాలు సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నాయి.
(5 / 8)
చారిత్రక పుణ్యక్షేత్రమైన ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చారు. భక్తుల కోసం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆయా శాఖల తరపున ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులు దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బారీకేడ్లను ఏర్పాటు చేసి క్యూలైన్లలో వచ్చి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. జాతరలో ఎలాంటి అపరిశుభ్రత లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ ఏర్పాట్లను చేశారు. ఆలయంతో పాటు చుట్టుపక్కల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం నీటి సౌకర్యాన్ని కల్పించారు.
(6 / 8)
ఆర్టీసీ అధికారులు హనుమకొండ, వరంగల్ నుంచి జాతరకు వచ్చే భక్తుల కోసం బస్సు సౌకర్యాలను కల్పిస్తున్నారు. రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాది మంది తరలి వస్తారు కనుక పోలీసు అధికారులు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను పూర్తి చేశారు. పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు వందలాదిమంది పోలీస్ సిబ్బంది బందోబస్తును నిర్వహిస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో దర్శనం కోసం వస్తున్న నేపథ్యంలో మహిళా పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చెక్ పోస్టులు,పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు
ఇతర గ్యాలరీలు