Spur Winged Lapwing Bird : అమ్మవారి పేటలో అరుదైన పక్షి, చూసేందుకు క్యూ కట్టిన పక్షి ప్రేమికులు-warangal news in telugu ammavaripeta pond found spur winged lapwing bird ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Spur Winged Lapwing Bird : అమ్మవారి పేటలో అరుదైన పక్షి, చూసేందుకు క్యూ కట్టిన పక్షి ప్రేమికులు

Spur Winged Lapwing Bird : అమ్మవారి పేటలో అరుదైన పక్షి, చూసేందుకు క్యూ కట్టిన పక్షి ప్రేమికులు

Mar 02, 2024, 03:13 PM IST HT Telugu Desk
Mar 02, 2024, 03:13 PM , IST

  • Spur Winged Lapwing Bird : దేశంలో తొలిసారిగా కనపడిన స్పర్ వింగ్డ్ లాప్వింగ్ లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిని చూడడానికి...వివిధ రాష్ట్రాల నుంచి పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రజ్ఞులు, వరంగల్ దగ్గర ఉన్న అమ్మవారిపేట చెరువు దగ్గరకి లైన్ కడుతున్నారు.

దేశంలో తొలిసారిగా కనపడిన స్పర్ వింగ్డ్ లాప్వింగ్(spur winged lapwing) లేదా స్పర్ వింగ్డ్ ఫ్లవర్ అనే పక్షిని చూడడానికి...వివిధ రాష్ట్రాల నుంచి పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రజ్ఞులు, వరంగల్ దగ్గర ఉన్న అమ్మవారిపేట చెరువు దగ్గరకి లైన్ కడుతున్నారు. 

(1 / 7)

భారత దేశం నుంచే కాకుండా, స్విట్జర్లాండ్ లో ఉన్న తెలంగాణకు చెందిన సైంటిస్ట్ బిక్షం గుజ్జా స్విట్జర్లాండ్ నుంచి అమ్మవారిపేట చెరువు దగ్గరికి వచ్చి ఈ అరుదైన పక్షి ఫొటో తీశారు.  అదే విధంగా బెంగుళూరు, దిల్లీ, పూణె, జోధాపూర్, ముంబయి, కేరళ తదితర ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు అమ్మవారిపేట చెరువు దారి పడుతున్నారు.

(2 / 7)

సూర్యాపేట జిల్లాకు చెందిన పక్షి ప్రేమికుడు ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో ఉన్న వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థలో పనిచేస్తున్న బిక్షం గుజ్జా ప్రత్యేకంగా ఈ పక్షిని చూడడానికి అమ్మవారిపేటకు వచ్చారు.

(3 / 7)

బెంగుళూరు నుంచి వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్లు మంజుల దేశాయ్, కొండస్వామి ధన్ పాల్, ఆల్బిన్ అబ్రాహం జాకబ్ విమానంలో హైదరాబాద్ కి వచ్చి తర్వాత కారులో వరంగల్ దగ్గర ఉన్న అమ్మవారిపేట చెరువు దగ్గరికి వెళ్లారు. అక్కడ స్పర్ వింగ్డ్ లాప్వింగ్ ని చూసి...ఆ పక్షి చిత్రాలు తీశారు.  

(4 / 7)

పూణె నుంచి ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుదీష్ణ డే, జోధాపూర్ నుంచి దిగ్విజయ్ సింగ్ రాథోర్ తమ తమ ప్రాంతాల నుంచి విమానంలో ప్రయాణం చేసి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి నుంచి అమ్మవారిపేట చెరువు దగ్గరకి వెళ్లి ఈ అరుదైన పక్షిని వీక్షించి, తమ కెమెరాలలో బంధించారు.  

(5 / 7)

దిల్లీ నుంచి అతుల్ జైన్, హరీష్ తంగరాజ్, నీతూ ఎస్ తదితరులు దేశ రాజధాని నుంచి వరంగల్ చేరుకున్నారు.అనంతరం స్పేర్ వింగ్డ్ లాప్వింగ్ ని చూడడానికి అమ్మవారిపేటకు వచ్చారు.  

(6 / 7)

చాలా వ్యయప్రయాసలతో వచ్చిన ఈ పక్షి ప్రేమికులు స్పేర్ వింగ్డ్ లాప్వింగ్ చూడగలిగారు.  మంచి ఫొటోస్ తీసుకున్న తర్వాత వారు అదే రోజు తమ తమ ప్రాంతాలకు తిరుగుముఖం పట్టారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు