వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు-vemulawada rajarajeshwara swamy temple bathukamma festival celebrations ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు

Oct 14, 2023, 08:49 PM IST HT Telugu Desk
Oct 14, 2023, 08:49 PM , IST

  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా దేవాలయం వెనుకవైపున చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.

పూలతో దేవుళ్లను పూజిస్తారు కానీ, పూలనే దేవుళ్లుగా పూజించే గొప్ప సంస్కృతి బతుకమ్మ పండుగదనే చెప్పవచ్చు. ప్రకృతిని ఆరాధించే ఆడబిడ్డల పూలపండుగ బతుకమ్మ. 

(1 / 7)

తెలంగాణ పల్లె జీవితాన్ని ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే అద్భుతమైన పండుగను వాడవాడలా మహిళలు చిన్నాపెద్దా తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. 

(2 / 7)

ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఆడే బతుకమ్మ ఆటల్లో ఎంతో ఉత్సాహంగా మహిళలు పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఆరాధిస్తున్నారు. 

(3 / 7)

తెలంగాణ ఆడపడుచులందరు పేద, ధనిక, చిన్నా పెద్ద, అనే వ్యత్యాసం లేకుండా...బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ వీధి చూసినా రంగురంగుల పూల బతుకమ్మలతో కొత్తశోభను సంతరించుకున్నాయి. 

(4 / 7)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు,యువతులు, పిల్లలు అనే తారతమ్యం లేకుండా దేవాలయం వెనుకవైపున చేరి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగే బతుకమ్మ వేడుకలకోసం రంగురంగుల దీపాలను అలంకరించారు. 

(5 / 7)

శ్రీచక్ర ఆకృతిలో పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి దేవతల పాటలతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకున్నారు. అనంతరం మేళతాళాల మధ్య దేవాలయం పక్కన గల పుష్కరిణిలో బతుకమ్మ నిమజ్జనం చేసి ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. 

(6 / 7)

ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలలో ఉన్నవాళ్లం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బతుకమ్మ ఉత్సవాలకు కచ్చితంగా వస్తామని యువతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు