Vande Bharat Sleeper : రైలు పట్టాలపై స్వర్గం.. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?-vande bharat sleeper coaches unveiled in pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vande Bharat Sleeper : రైలు పట్టాలపై స్వర్గం.. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Sleeper : రైలు పట్టాలపై స్వర్గం.. వందేభారత్ స్లీపర్ కోచ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?

Oct 24, 2024, 06:06 PM IST Basani Shiva Kumar
Oct 24, 2024, 06:06 PM , IST

  • Vande Bharat Sleeper : వందేభారత్ స్లీపర్ క్లాస్ కోచ్‌ల ఫొటోలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో ఈ కోచ్‌లను రూపొందిస్తున్నారు. అన్ని ట్రయల్స్ అయిపోయాక వచ్చే ఏడాది జనవరిలో ఈ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.

ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ బోగీలు చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఒక బోగీని ఐసీఎఫ్‌ అధికారులు విడుదల చేశారు.

(1 / 5)

ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వందేభారత్‌ స్లీపర్‌ బోగీలు చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారవుతున్నాయి. ప్రయోగాత్మకంగా సిద్ధం చేసిన ఒక బోగీని ఐసీఎఫ్‌ అధికారులు విడుదల చేశారు.(@trainwalebhaiya)

బోగీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. 1200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయని అధికారులు వివరించారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పయనించేలా ఏర్పాట్లు చేశారు.

(2 / 5)

బోగీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా.. 1200 కిలోమీటర్లు ప్రయాణించేందుకు అవసరమైన సదుపాయాలు ఉంటాయని అధికారులు వివరించారు. గంటకు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో పయనించేలా ఏర్పాట్లు చేశారు.(@trainwalebhaiya)

ఈ స్లీపర్ క్లాస్ కోచ్‌ల్లో మొబైల్‌ ఛార్జింగ్, మ్యాగజైన్లు, టేబుల్, సామగ్రి కోసం విశాల స్థలం, చిన్నపాటి లైట్, వేడి నీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవరుతో మాట్లాడే సౌకర్యం ఉంది. 

(3 / 5)

ఈ స్లీపర్ క్లాస్ కోచ్‌ల్లో మొబైల్‌ ఛార్జింగ్, మ్యాగజైన్లు, టేబుల్, సామగ్రి కోసం విశాల స్థలం, చిన్నపాటి లైట్, వేడి నీరు, సీసీ కెమెరాలు, అత్యవసర సమయాల్లో డ్రైవరుతో మాట్లాడే సౌకర్యం ఉంది. (@trainwalebhaiya)

ట్రయల్స్ కోసం లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపనున్నారు. ఆ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒక్కో ట్రైన్‌లో 11 త్రీ టైర్ ఏసీ కోచ్‌లు, 4 టూ టైర్ ఏసీ కోచ్‌లు, ఒకటి ఫస్ట్ క్లాస్ కోచ్ ఉన్నాయి. మొత్తం 823 మంది దీంట్లో ప్రయాణిచవచ్చు. 

(4 / 5)

ట్రయల్స్ కోసం లక్నోలోని రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్‌కు పంపనున్నారు. ఆ తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉంది. ఒక్కో ట్రైన్‌లో 11 త్రీ టైర్ ఏసీ కోచ్‌లు, 4 టూ టైర్ ఏసీ కోచ్‌లు, ఒకటి ఫస్ట్ క్లాస్ కోచ్ ఉన్నాయి. మొత్తం 823 మంది దీంట్లో ప్రయాణిచవచ్చు. (@trainwalebhaiya)

స్లీపర్ క్లాసులు ఉన్న వందేభారత్ రైళ్లలో వాష్‌ రూమ్‌లు కూడా బాగా డిజైన్ చేశారు. వెస్టర్న్, ఇండియన్ స్టైల్‌లో తీర్చిదిద్దారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటీరియర్ బాగుందని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు. 

(5 / 5)

స్లీపర్ క్లాసులు ఉన్న వందేభారత్ రైళ్లలో వాష్‌ రూమ్‌లు కూడా బాగా డిజైన్ చేశారు. వెస్టర్న్, ఇండియన్ స్టైల్‌లో తీర్చిదిద్దారు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటీరియర్ బాగుందని నెటిజన్లు కితాబు ఇస్తున్నారు. (@trainwalebhaiya)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు