తెలుగు న్యూస్ / ఫోటో /
Dhanatrayodashi 2022। ధనత్రయోదశి నాడు వీటిని అస్సలు కొనుగోలు చేయకూడదు, ఎందుకంటే?
- Dhanatrayodashi 2022: ఈ ఏడాది అక్టోబర్ 23న ధన త్రయోదశి వస్తుంది. ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈరోజున కుబేరుడు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. అలాగే కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని వస్తువులను మాత్రం ఈరోజు కొనుగోలు చేయడం అశుభం అని పండితులు చెబుతున్నారు. అవేంటో చూడండి.

(1 / 7)
ధనత్రయోదశి అనేది శ్రేయస్సు, సంపద వృద్ధిని కలుగజేసే విశిష్టమైన పండుగ. దీనిని ధన్‌తేరాస్ అని కూడా అంటారు. ఎంతో మంచి రోజుగా చెప్పే ధనత్రయోదశి నాడు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తే అదృష్టం, శుభసూచికంగా భావిస్తారు. అయితే కొన్ని కొనకూడని వస్తువులు కూడా ఉన్నాయి.(Stock Pic)
(2 / 7)
ఇనుము: ధనత్రయోదశి రోజున ఇనుముతో చేసిన వస్తువులు కొనుగోలు చేయడం అశుభకరమైనదిగా చెబుతారు.(Unsplash)
(3 / 7)
స్టీల్: ధనత్రయోదశి రోజున స్టీల్ పాత్రలు కూడా కొనుగోలు చేయడం మంచిది కాదని చెబుతారు. అయితే ఇత్తడి లేదా రాగితో చేసిన పాత్రలను కొనుగోలు చేయవచ్చు.
(4 / 7)
నూనె లేదా నెయ్యి: నెయ్యి, వెన్న, ఆవనూనె వంటి నూనె సంబంధిత ఉత్పత్తులను ధనత్రయోదశి రోజున కొనుగోలు చేయడం అశుభం అని భావిస్తారు. ఈ దీపావళి పండుగకి నూనెలు అవసరమైనవే అయితే, వీటిని ముందస్తుగానే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.
(5 / 7)
పదునైన వస్తువులు: ధనత్రయోదశి ఆనేది శుభ దినం కాబట్టి, ప్రజలు ఈ రోజున కత్తులు, కత్తెరలు వంటి పదునైన వస్తువులను కొనుగోలు చేయకూడదు.
(6 / 7)
నకిలీ బంగారం: ధనత్రయోదశి రోజున బంగారు వస్తువులను కొనుగోలు చేయడం శుభకరమే. అయితే నకిలీ బంగారు వస్తువులు, గిల్ట్ నగలకు దూరంగా ఉండాలి.
ఇతర గ్యాలరీలు