Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు పథకం షెడ్యూల్ ఇదే, లబ్దిదారుల జాబితా ఎప్పుడంటే?
Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.
(1 / 6)
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై మరో అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా విడుదల చేయనున్నారు.
(2 / 6)
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్లు చొప్పున లబ్దిదారులకు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేనివారికి స్థలమిచ్చి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు.
(3 / 6)
మహిళల పేరుతో ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. మొత్తం 4 దశల్లో 5 లక్షల వరకు ఆర్థిక సాయం చేయనుంది. ఓ ప్రత్యేక యాప్ లో లబ్దిదారుల వివరాలు నమోదు చేయనున్నారు.
(4 / 6)
గ్రామాలలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ మధ్య గ్రామ సభల నిర్వహించి తద్వారా అర్హులైన వారిని గుర్తించి జాబితాలు ఖరారు చేయనున్నారు. మొత్తం 15 రోజుల్లోనే గ్రామ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగనుంది.
(5 / 6)
ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే మంజూరు చేయనున్నారు. కనీసం 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇల్లు నిర్మించుకునేలా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందిన వారికి ఈసారి కేటాయింపులు ఉండమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఇతర గ్యాలరీలు