Ashwin Records: ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అశ్విన్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్.. నిఖార్సయిన ఆల్ రౌండర్-ravichandran ashwin creates many records with century in india vs bangladesh 1st test ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ashwin Records: ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అశ్విన్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్.. నిఖార్సయిన ఆల్ రౌండర్

Ashwin Records: ఒక్క సెంచరీ.. ఎన్నో రికార్డులు.. అశ్విన్ మాస్టర్‌క్లాస్ ఇన్నింగ్స్.. నిఖార్సయిన ఆల్ రౌండర్

Sep 19, 2024, 06:10 PM IST Hari Prasad S
Sep 19, 2024, 06:10 PM , IST

  • Ashwin Records: అశ్విన్ ఒక్క సెంచరీతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు అతడు 112 బంతుల్లో అజేయంగా 102 పరుగులు చేసిన విషయం తెలిసిందే. తన 38వ పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత చెన్నైలో గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు.

Ashwin Records: టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో 20సార్లు 50కిపైగా స్కోర్లు, 30కిపైగాసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ అతడే. అశ్విన్ టెస్టుల్లో 14 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు చేయడంతోపాటు 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.

(1 / 4)

Ashwin Records: టెస్టు క్రికెట్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. టెస్టుల్లో 20సార్లు 50కిపైగా స్కోర్లు, 30కిపైగాసార్లు ఒక ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్ అతడే. అశ్విన్ టెస్టుల్లో 14 హాఫ్ సెంచరీలు, ఆరు సెంచరీలు చేయడంతోపాటు 36సార్లు ఒక ఇన్నింగ్స్ లో 5, అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు.(PTI)

Ashwin Records: టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు సాధించిన మొత్తం సెంచరీల సంఖ్య ఎనిమిది. ఆ ఎనిమిదింటిలో అశ్విన్ ఒక్కడే ఆరు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే ఒక సెంచరీ చేయగా.. మరొకటి స్టువర్ట్ బ్రాడ్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిది మంది ఆటగాళ్లు 500కు పైగా వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, కుంబ్లే, బ్రాడ్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్, కోర్ట్నీ వాల్ష్, అశ్విన్. 

(2 / 4)

Ashwin Records: టెస్టుల్లో 500కు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్లు సాధించిన మొత్తం సెంచరీల సంఖ్య ఎనిమిది. ఆ ఎనిమిదింటిలో అశ్విన్ ఒక్కడే ఆరు సెంచరీలు సాధించాడు. అనిల్ కుంబ్లే ఒక సెంచరీ చేయగా.. మరొకటి స్టువర్ట్ బ్రాడ్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొమ్మిది మంది ఆటగాళ్లు 500కు పైగా వికెట్లు తీశారు. ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, జేమ్స్ అండర్సన్, కుంబ్లే, బ్రాడ్, గ్లెన్ మెక్‌గ్రాత్, నాథన్ లయన్, కోర్ట్నీ వాల్ష్, అశ్విన్. (AFP)

Ashwin Records: టెస్టుల్లో ఒక నిర్దిష్ట మైదానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్స్ జాబితాలో అశ్విన్ చేరాడు. ఈ 'డబుల్' రికార్డుల జాబితాలో మొత్తం ఐదుగురు ప్లేయర్స్ ఉండగా.. వాళ్లలో అశ్విన్ ఒకడు. గతంలో ఇదే చెపాక్ లో అతడు ఇంగ్లండ్ తోనూ సెంచరీ చేశాడు.

(3 / 4)

Ashwin Records: టెస్టుల్లో ఒక నిర్దిష్ట మైదానంలో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు, ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్లేయర్స్ జాబితాలో అశ్విన్ చేరాడు. ఈ 'డబుల్' రికార్డుల జాబితాలో మొత్తం ఐదుగురు ప్లేయర్స్ ఉండగా.. వాళ్లలో అశ్విన్ ఒకడు. గతంలో ఇదే చెపాక్ లో అతడు ఇంగ్లండ్ తోనూ సెంచరీ చేశాడు.(AFP)

Ashwin Records: టెస్టుల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశ్విన్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఎనిమిదో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి నాలుగు సెంచరీలు సాధించాడు. 

(4 / 4)

Ashwin Records: టెస్టుల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశ్విన్ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఎనిమిదో స్థానంలో లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి నాలుగు సెంచరీలు సాధించాడు. (AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు