Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?-rajinikanth daughter soundarya rajinikanth hoote app closed due to lack of customer response ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?

Hoote Closed: రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ హూటే యాప్‌ మూసివేత.. కారణం ఏంటంటే?

Published Jul 11, 2024 01:38 PM IST Sanjiv Kumar
Published Jul 11, 2024 01:38 PM IST

Soundarya Rajinikanth Hoote App Closed: ఇటీవల కాలంలో యూజర్స్ తక్కువగా ఉంటున్నారన్న కారణాలతో కూ వంటి పలు యాప్‌లను తొలగించారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ లాంచ్ చేసిన హూటే యాప్‌ను సైతం క్లోజ్ చేశారు.

2021 లో రజనీకాంత్ కుమార్తె సౌందర్య హూటే (హుడ్) అనే వాయిస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌ను ప్రారంభించింది. ఆమ్టెక్స్ భాగస్వామ్యంతో ఈ యాప్‌ను తమిళంతోపాటు అంతర్జాతీయ భాషలతో సహా 15 భారతీయ భాషల్లో లాంచ్ చేశారు. 

(1 / 7)

చదవని వారు కూడా సులభంగా తమ అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా ఈ యాప్ ను రూపొందించారు. హూటే యాప్ ద్వారా ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఎవరైనా తమ అభిప్రాయాన్ని వాయిస్ మెసేజ్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవచ్చు.

(2 / 7)

హూటే యాప్ ఫేస్ బుక్, ఎక్స్, వాట్సప్ లతో పోటీ పడుతుందని భావించినప్పటికీ ఈ యాప్ ను వాడే యూజర్ల సంఖ్య తగ్గడంతో కంపెనీని మూసివేయాలని సౌందర్య రజినీకాంత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

(3 / 7)

గతంలో కూ అనే యాప్ కు ఆదరణ లేకపోవడంతో మూసివేశారు. ఈ నేపథ్యంలో సౌందర్య రజినీకాంత్ కు చెందిన హూటే యాప్ కూడా తన పనితీరును నిలిపివేసింది. 

(4 / 7)

అలాగే, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ప్రారంభించిన అరట్టాయ్ యాప్ కూడా కేవలం 100,000 డౌన్‌లోడ్స్‌తో ఆదరణ పొందడంలో విఫలమైంది.

(5 / 7)

కరోనా లాక్‌డోన్ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఎదుర్కొన్న సమయంలో కూ, హూటే, అరట్టైలను ప్రారంభించారు.

(6 / 7)

ఇప్పటికే వాడుకలో ఉన్న యాప్ ల స్థానంలో ఎలాంటి వినూత్న ఆలోచనలు, కొత్త వ్యూహాలు లేకుండా ప్రవేశపెట్టిన ఈ మూడు యాప్ లు అనతికాలంలోనే యూజర్ల ఆసక్తిని కోల్పోయాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు