Manu Bhaker Net Worth: మెడల్ గెలిచిన మను బాకర్ సంపాదించింది ఎంత? ఆమె సంపద విలువ ఎంతో తెలుసా?-paris olympcis medal winner shooter manu bhaker net worth other details manu bhaker age other details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Manu Bhaker Net Worth: మెడల్ గెలిచిన మను బాకర్ సంపాదించింది ఎంత? ఆమె సంపద విలువ ఎంతో తెలుసా?

Manu Bhaker Net Worth: మెడల్ గెలిచిన మను బాకర్ సంపాదించింది ఎంత? ఆమె సంపద విలువ ఎంతో తెలుసా?

Published Jul 29, 2024 05:34 PM IST Hari Prasad S
Published Jul 29, 2024 05:34 PM IST

  • Manu Bhaker Net Worth: పారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు తొలి మెడల్ అందించి చరిత్ర సృష్టించిన మను బాకర్ ఈ మెడల్ ద్వారా సంపాదించింది ఏమీ లేకపోయినా.. ఆమె సంపద విలువ మాత్రం కోట్లలోనే ఉంది.

Manu Bhaker Net Worth: ఇండియా తరఫున ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి మహిళా షూటర్ గా 22 ఏళ్ల మను బాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమెకు బ్రాంజ్ మెడల్ వచ్చింది. మను కంటే ముందు రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ మెడల్స్ గెలిచారు.

(1 / 8)

Manu Bhaker Net Worth: ఎంతో ఖరీదైన క్రీడ అయిన షూటింగ్ ను కెరీర్ గా ఎంచుకున్న మను బాకర్ సంపద విలువ రూ.12 కోట్లుగా ఉంటుందని పలు మీడియా రిపోర్టులు తెలిపాయి. వీటిలో ఆమె ఒలింపిక్స్ మెడల్ ద్వారా గెలిచింది ఏమీ లేకపోయినా.. ఇతర ఈవెంట్లలో గెలిచిన మొత్తం, కమర్షియల్ కమిట్మెంట్స్ తో సంపాదించింది చాలానే ఉంది.

(2 / 8)

(AFP)

Manu Bhaker Net Worth: యూత్ ఒలింపిక్స్ 2018లో మను బాకర్ గోల్డ్ మెడల్ గెలిచింది. ఆ సమయంలో హర్యానా ప్రభుత్వం ఆమెకు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది కేవలం హామీ తప్ప తనకు దక్కిందేమీ లేదని ఆమె చేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ అయింది.

(3 / 8)

(Team India-X)

Manu Bhaker Net Worth: మను బాకర్ కెరీర్ మొదట్లోనే ఆమె తండ్రి రూ.1.5 లక్షలు వెచ్చించాడట. ఆ తర్వాత ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ కార్యక్రమంలో భాగంగా కూడా ఆమెకు సపోర్ట్ లభించింది.

(4 / 8)

(PTI)

Manu Bhaker Net Worth: అయితే ఒలింపిక్స్ లో మను బాకర్ మెడల్ గెలవగా.. దీనికోసం ఆమె శిక్షణకే కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్లు ఖర్చు చేసినట్లు క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.

(5 / 8)

Manu Bhaker Net Worth: ఒలింపిక్స్ కు ముందు శిక్షణ కోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు పంపించారు. ఆమెకు నచ్చిన ట్రైనర్ ను కూడా ఇవ్వడం విశేషం.

(6 / 8)

Manu Bhaker Net Worth: 22 ఏళ్ల మను బాకర్ హర్యానాలోని జజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామానికి చెందిన అథ్లెట్. ఆమె తల్లి ఓ స్కూల్ టీచర్ కాగా.. తండ్రి ఓ మెరైన్ ఇంజినీర్.

(7 / 8)

Manu Bhaker Net Worth: మను బాకర్ ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తర్వాత ఆమె గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పారిస్ ఒలింపిక్స్ లోనే ఆమె మరో రెండు ఈవెంట్లలో పాల్గొననుంది.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు