Russia-Ukraine Crises: కీలక పరిణామాలు.. హృదయవిదారక దృశ్యాలు-russiaukraine crises key points you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Russia-ukraine Crises: కీలక పరిణామాలు.. హృదయవిదారక దృశ్యాలు

Russia-Ukraine Crises: కీలక పరిణామాలు.. హృదయవిదారక దృశ్యాలు

Feb 25, 2022, 11:18 PM IST HT Telugu Desk
Feb 25, 2022, 11:18 PM , IST

  • "డాన్‌బాస్ వేర్పాటువాద ప్రాంతంలోని ప్రజలను రక్షించడానికి సైనిక చర్య చేపట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను" అని రష్యా అధ్యక్షుడు పుతిన్ జాతినుద్దేశించి ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆయన ప్రసంగం పూర్తైన మరుక్షణం నుంచి ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కివ్, ఒడెసా నగరాల్లో బాంబు పేలుళ్లు మొదలయ్యాయి.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన ఉక్రేనియన్ సైనికులను హెచ్చరించారు. వెంటనే ఆయుధాలు వీడి పారిపోండి అని హెచ్చరించారు. యుద్ధం ప్రారంభించిన మొదటిరోజే 83 ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

(1 / 9)

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022, ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఆయన ఉక్రేనియన్ సైనికులను హెచ్చరించారు. వెంటనే ఆయుధాలు వీడి పారిపోండి అని హెచ్చరించారు. యుద్ధం ప్రారంభించిన మొదటిరోజే 83 ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.(AFP)

తూర్పు ఉక్రెయిన్‌లో పౌరులను రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం 2014 నుంచి ఉక్రేనియన్ దళాలతో రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదుల మధ్య నిరంతర పోరాటం చేస్తున్నాయి అని పుతిన్ పేర్కొన్నారు.

(2 / 9)

తూర్పు ఉక్రెయిన్‌లో పౌరులను రక్షించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం 2014 నుంచి ఉక్రేనియన్ దళాలతో రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదుల మధ్య నిరంతర పోరాటం చేస్తున్నాయి అని పుతిన్ పేర్కొన్నారు.(AFP)

ఉక్రెయిన్‌లో తాము చేపడుతున్న 'సైనిక చర్య' విషయంలో ఎవరైనా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే అది 'చరిత్రలో ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది' అని పుతిన్ ఇతర దేశాలను హెచ్చరించారు.

(3 / 9)

ఉక్రెయిన్‌లో తాము చేపడుతున్న 'సైనిక చర్య' విషయంలో ఎవరైనా జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే అది 'చరిత్రలో ఎన్నడూ చూడని తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది' అని పుతిన్ ఇతర దేశాలను హెచ్చరించారు.(AFP)

రష్యా దురాక్రమణ కారణంగా తమ 137 మంది సైనికులు, పలువురు పౌరులు మరణించారని, అలాగే వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెల్లవారుజామున వీడియో ప్రసంగంలో తెలిపారు.

(4 / 9)

రష్యా దురాక్రమణ కారణంగా తమ 137 మంది సైనికులు, పలువురు పౌరులు మరణించారని, అలాగే వందలాది మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ శుక్రవారం తెల్లవారుజామున వీడియో ప్రసంగంలో తెలిపారు.(AFP)

రష్యా చర్యను 'ఎవరి ప్రేరేపణ లేని, ఎలాంటి హెచ్చరికలు లేని ఒక అన్యాయమైన దాడి' అని యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ అభివర్ణించారు.

(5 / 9)

రష్యా చర్యను 'ఎవరి ప్రేరేపణ లేని, ఎలాంటి హెచ్చరికలు లేని ఒక అన్యాయమైన దాడి' అని యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ జో బిడెన్ అభివర్ణించారు.(REUTERS)

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జీ7 దేశాలు ఖండించాయి. ప్రపంచ శాంతి, భద్రతకు ఇది తీవ్ర విఘాత చర్యగా అభివర్ణించాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించి ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలవాలని కోరాయి.

(6 / 9)

ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జీ7 దేశాలు ఖండించాయి. ప్రపంచ శాంతి, భద్రతకు ఇది తీవ్ర విఘాత చర్యగా అభివర్ణించాయి. అంతర్జాతీయ సమాజం కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించి ఉక్రెయిన్‌కు మద్ధతుగా నిలవాలని కోరాయి.(AFP)

దాడికి ముందు ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా దాదాపు 200,000 మంది సైనికులను మోహరించినట్లు యునైటెడ్ స్టేట్స్ వెల్లడించింది.

(7 / 9)

దాడికి ముందు ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి రష్యా దాదాపు 200,000 మంది సైనికులను మోహరించినట్లు యునైటెడ్ స్టేట్స్ వెల్లడించింది.(AP)

రష్యా దాడి నేపథ్యంలో ప్రానభయంతో దేశం నుంచి పారిపోతున్న ఉక్రేనియన్ల కోసం పొరుగు తమ సరిహద్దులను తెరిచి ఉంచాలని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థి సంస్థ కోరింది.

(8 / 9)

రష్యా దాడి నేపథ్యంలో ప్రానభయంతో దేశం నుంచి పారిపోతున్న ఉక్రేనియన్ల కోసం పొరుగు తమ సరిహద్దులను తెరిచి ఉంచాలని ఐక్యరాజ్యసమితికి చెందిన శరణార్థి సంస్థ కోరింది.(AFP)

బాంబు దాడులకు భయపడి ఉక్రెయిన్ లో నివసించే చాలా మంది పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో, తాత్కాలిక బాంబు షెల్టర్‌లలో ఆశ్రయం పొందారు. ఉండటానికి సరైన వసతులు లేక, కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక, వీధికుక్కలతో సావాసం చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

(9 / 9)

బాంబు దాడులకు భయపడి ఉక్రెయిన్ లో నివసించే చాలా మంది పౌరులు అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో, తాత్కాలిక బాంబు షెల్టర్‌లలో ఆశ్రయం పొందారు. ఉండటానికి సరైన వసతులు లేక, కప్పుకోవడానికి సరైన దుప్పట్లు లేక, వీధికుక్కలతో సావాసం చేస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు