తెలుగు న్యూస్ / ఫోటో /
Acer MUVI 125 4G: ఇండియన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మార్కెట్లోకి తైవాన్ దిగ్గజ కంపెనీ ఏసర్..
Acer MUVI 125 4G: తైవాన్‌కు చెందిన ఏసర్ కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఏసర్ ఎంయూవీఐ 125 4జీ (Acer MUVI 125 4G) మోడల్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది, ఆ బైక్ ధర, ఫీచర్లు, ఇతర వివరాలు మీ కోసం..
(1 / 6)
తైవాన్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఏసర్ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది, దీని ధర రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మరో పోటీదారుగా ప్రవేశించింది.
(2 / 6)
Acer త్వరలో Acer MUVI 125 4G కోసం ప్రి-బుకింగ్‌లను ప్రారంభించనుంది. భారత్ లో కంపెనీ డీలర్‌షిప్ లపై ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని కోరింది. పూర్తి వివరాల కోసం కంపెనీ వెబ్ సైట్ ను సందర్శించాలి.
(3 / 6)
ఈ ఏడాది సెప్టెంబర్‌లో గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2023లో ఏసర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను మొదటిసారిగా ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రికర్ స్కూటర్ రెండు బ్యాటరీలతో వస్తుంది, ఒకసారి ఫుల్ గా ఛార్జింగ్ చేస్తే, గరిష్టంగా 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఒక్కో బ్యాటరీని దాదాపు నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
(4 / 6)
ఏసర్ ఎంయూవీఐ 125 4జీ (Acer MUVI 125 4G) ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 75 కిమీల వేగంతో ప్రయాణించగలదు. ఈ బైక్ కలర్స్ లో లభిస్తుంది: వైట్, బ్లాక్, గ్రే కలర్స్ లో ఇది లభిస్తుంది.
(5 / 6)
ఈ స్కూటర్ ను నగర ప్రయాణీకులు, పట్టణ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది తేలికైన, ఇంకా దృఢమైన ఫ్రేమ్ తో వస్తుంది. ఇందులో 16-అంగుళాల వీల్స్ ను అమర్చారు. ఈ బైక్ లోని ప్రత్యేక షాక్ అబ్జార్బర్ సిస్టమ్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
ఇతర గ్యాలరీలు