తెలుగు న్యూస్ / ఫోటో /
Missing Day । మీ మాజీని మరచి పోలేకపోతున్నారా? మళ్లీ ఈ తప్పులు మాత్రం చేయకండి!
- Missing Day: మిస్సింగ్ డే యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లోని ఆరవ రోజున వస్తుంది. ఈ రోజు తాము ప్రేమించిన వ్యక్తి, తమ జీవితంలో లేనపుడు వారి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, స్వతంత్రంగా ఉండటం గురించి తెలిపే రోజు..
- Missing Day: మిస్సింగ్ డే యాంటీ-వాలెంటైన్స్ వీక్‌లోని ఆరవ రోజున వస్తుంది. ఈ రోజు తాము ప్రేమించిన వ్యక్తి, తమ జీవితంలో లేనపుడు వారి జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి, స్వతంత్రంగా ఉండటం గురించి తెలిపే రోజు..
(1 / 6)
ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే తర్వాత వెంటనే, ఫిబ్రవరి 15 నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే జరుపుకుంటారు.(Unsplash)
(2 / 6)
మీ మాజీలను కలవకండి: విడిపోయిన తర్వాత, మీరు మీ మాజీ ప్రియులను లేదా భాగస్వామిని కలవడం గానీ, చూసే ప్రయత్నాలు గానీ చేయకూడదు. వారిని మళ్లీ కలవడాన్ని మీరు పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా కష్టతరమైనదే కావొచ్చు, కానీ గడ్డుకాలాన్ని ఎదురొడ్డాలి. (Unsplash)
(3 / 6)
ఏ విధమైన కాంటాక్ట్ వద్దు: మీ స్నేహితులు ద్వారా లేదా వారితో సన్నిహిత వ్యక్తుల ద్వారా మీ మాజీల క్షేమసమాచారం గురించి అడగకండి, వారిని ఏ విధంగానూ కాంటాక్ట్ చేయవద్దు. ఇది అంత తేలికైన పని కాదు కానీ, మీరు మీ గురించి మాత్రమే ఆలోచించాల్సిన సందర్భం ఇది. (Unsplash)
(4 / 6)
స్నేహితులుగా కొనసాగడం: కొంతమంది తమ భాగస్వామితో తెగదెంపులు చేసుకున్నా, మంచి స్నేహితులుగా ఉండాలని కోరుకుంటారు. మీరూ అలాగే భావిస్తే, ముందుకు సాగండి, కానీ అది మిమ్మల్ని బాధపెడుతుందేమో ఆలోచించండి, దూరంగా ఉండటమే మేలు. (Unsplash)
(5 / 6)
వెంటపడవద్దు: విడిపోయిన తర్వాత మీ మాజీ భాగస్వామి ఎలా ఉన్నారు, వారి జీవితం ఎలా సాగుతుంది, వారు ఎవరితో ఉంటున్నారు వంటి తపన ఉండటం, కానీ వారితో మీ అధ్యాయం ముగిసిపోయింది. మీ దృష్టిని మీ పురోగతిపై పెట్టండి. (Unsplash)
ఇతర గ్యాలరీలు