(1 / 10)
ఎక్కువ సేపు కూర్చుని వర్క్ చేస్తున్నారా?.. చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీవన శైలిలో ఈ కింది మార్పులు చేసుకుని ఆరోగ్యంగా ఉండండి.
(Freepik)(2 / 10)
మీరు రోజూ 9-10 గంటలు కూర్చుని పని చేస్తుంటే, మీరు పని కోసం స్టాండింగ్ డెస్క్ ను ఉపయోగించండి. లేదా మీరు ప్రతి అరగంటకు లేచి, కాసేపు నడవండి.
(Unsplash)(3 / 10)
స్వల్పకాలిక శారీరక కార్యకలాపాలు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మీ స్టెప్ కౌంట్ ను మెరుగుపరచడానికి ప్రతి గంటకు ఒక సారి 5-10 నిమిషాలు నడవండి.
(Shutterstock)(4 / 10)
ఫోన్ లో కూర్చుని మాట్లాడకండి. బదులుగా మీరు మాట్లాడేటప్పుడు లేచి నడవడం ప్రారంభించండి. మీరు దీన్ని ఆఫీస్ లో లేదా ఇంట్లో ప్రాక్టీస్ చేయవచ్చు.
(Freepik)(5 / 10)
లిఫ్ట్/ఎలివేటర్ కు బదులుగా మెట్లను ఉపయోగించండి. ఇది మీరు శారీరకంగా చురుకుగా ఉండేలా చేస్తుంది. మీ కండరాలకు వ్యాయామం కూడా లభిస్తుంది.
(Freepik)(6 / 10)
ఆఫీస్ కి దూరంగా వాహనాలను పార్క్ చేసి మీ కార్యాలయానికి నడవండి. లేదా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించండి. ఇది మీరు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది.
(7 / 10)
టీవీ చూస్తున్నప్పుడు, ప్రతి కొన్ని నిమిషాలకు లేదా యాడ్స్ వచ్చిన సమయాలలో కాసేపు లేచి నడవండి.
(Unsplash)(8 / 10)
కండరాలు బలంగా ఉండడానికి వారానికి రెండు నుండి మూడు బరువు మోసే వ్యాయామాలు చేయండి.
(shutterstock)(9 / 10)
యోగా ను మీ దినచర్యలో భాగం చేసుకోండి. కొన్ని యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు జీవక్రియను వేగవంతం చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి.
(Pixabay)(10 / 10)
వారానికి రెండు రోజులైనా కాస్త కఠినమైన వ్యాయామాలు చేయండి. అవి మీ కండరాలను, ఎముకలను బలోపేతం చేస్తాయి. కండరాలను ఉపయోగించకపోవడం వల్ల అవి బలహీనమవుతాయి.
(Freepik)ఇతర గ్యాలరీలు