Rythu Bharosa Scheme : వాటికి మాత్రమే ‘రైతు భరోసా' డబ్బులు.! 'సీలింగ్‌' విధించే ఛాన్స్..? తాజా అప్డేట్స్ ఇవిగో-latest key updates about telangana govt rythu bharosa scheme guidelines ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Rythu Bharosa Scheme : వాటికి మాత్రమే ‘రైతు భరోసా' డబ్బులు.! 'సీలింగ్‌' విధించే ఛాన్స్..? తాజా అప్డేట్స్ ఇవిగో

Rythu Bharosa Scheme : వాటికి మాత్రమే ‘రైతు భరోసా' డబ్బులు.! 'సీలింగ్‌' విధించే ఛాన్స్..? తాజా అప్డేట్స్ ఇవిగో

Jun 27, 2024, 05:52 PM IST Maheshwaram Mahendra Chary
Jun 27, 2024, 05:25 PM , IST

  • TG Govt Rythu Bharosa scheme Updates: రైతు భరోసా స్కీమ్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా… కీలక అంశాలపై దృష్టిపెట్టింది. గతంలో మాదిరిగా కాకుండా…. మార్గదర్శకాల్లో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.

: రైతు భరోసా స్కీమ్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయగా… కీలక అంశాలపై దృష్టిపెట్టింది. గతంలో ఈ స్కీమ్ రైతుబంధు పేరు మీదుగా అమలు కాగా… ప్రస్తుతం ప్రభుత్వం రైతు భరోసాగా మార్చింది. 

(1 / 6)

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట పెట్టుబడి సాయం కింది ఏడాదికి రూ.15వేలు అందజేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని తెలిపింది. ఇప్పుడు అధికారంలో ఉండటంతో ఈ స్కీమ్ పై ఫోకస్ పెట్టింది.

(2 / 6)

ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో రైతు భరోసా స్కీమ్ పై మంత్రివర్గం చర్చించింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… స్కీమ్ అమలు విధానంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ నివేదిక రాగానే… ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కమిటీ లెవనెత్తే ప్రతి అంశంపై చర్చించనుంది. అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించి…. రైతు భరోసాపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

(3 / 6)

గత ప్రభుత్వంలో ఎన్ని ఎకరాలు ఉన్నా… రైతుబంధు ఇచ్చారు. ఇందులో  రహదారులు, గుట్టలు, వెంచర్లు, లే అవుట్లు, అసలు సాగుకు యోగ్యం కాని భూములు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇలాంటి వాటికి ఇవ్వకుండా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇచ్చే యోచనలో సర్కార్ ఉంది.. జులై 15 కల్లా ప్రభుత్వానికి కేబినెట్​ సబ్​ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

(4 / 6)

అసెంబ్లీలో కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై లోతుగా చర్చించనున్నారు.  నిర్ణయం జరిగిన దాని ప్రకారం ఈ వానాకాలం సీజన్​ కు గాను పెట్టుబడి సాయాన్ని(రైతు భరోసా స్కీమ్)  రైతుల ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

(5 / 6)

కేవలం సాగు భూములకే కాకుండా… సీలింగ్ పెట్టడంపై కూడా సర్కార్ ఫోకస్ పెట్టింది.     5 ఎకరాలు లేదా పదెకరాలకు పరిమితి విధించాలా అన్న దానిపై కూడా నిర్ణయం తీసుకోనుంది. సీలింగ్ పెట్టడం మాత్రం తప్పనిసరి అన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు