తెలుగు న్యూస్ / ఫోటో /
Srisailam Project Gates : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత, పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
- Srisailam Project Gates : భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు జలవనరుల శాఖ అధికారులు.
- Srisailam Project Gates : భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు జలవనరుల శాఖ అధికారులు.
(1 / 6)
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఒక్కొక్క గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
(2 / 6)
శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, అయితే ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగులకు చేరుకుంది.
(3 / 6)
శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 179.89 టీఎంసీలు నీటి నిల్వ చేరుకుంది. భారీగా వరద ప్రవాహం వస్తుండటంతో అధికారులు మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. (File Photo)
(4 / 6)
ఒక్కో గేటు నుంచి 27 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 6, 7, 8 గేట్లను ఎత్తడం ద్వారా మొత్తంగా 81 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. (File Photo)
(5 / 6)
కర్నూలు చీఫ్ ఇంజినీర్ కబీర్ బాషా శ్రీశైలం గేట్లను ఎత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేశారు. ఈ దృశ్యాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. (File Photo)
ఇతర గ్యాలరీలు