తెలుగు న్యూస్ / ఫోటో /
Moodagallu Temple : జూ.ఎన్టీఆర్ వెళ్లిన మూడగల్లు కేశవనాథేశ్వరుని ఆలయం విశేషాలేంటి?
- Moodagallu Temple : మూడగల్లు కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటకలోని కుందాపూర్ తాలూకా కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని జూ.ఎన్టీఆర్ సందర్శించారు.

(1 / 6)
మూడగల్లు కేశవనాథేశ్వర్ గుహ దేవాలయం ప్రకృతి అద్భుతానికి ప్రతీక. కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ తాలూకాలోని కెరడి గ్రామంలోని మూడగల్లులో ఈ ఆలయం ఉంది. కొద్దిపాటి జన సంచారం మాత్రమే ఉన్న చిన్న పల్లెటూరి మధ్యలో కొలువుదీరిన కేశవనాథేశ్వరుడి ఆలయం అద్భుతంగా ఉంటుంది.
(2 / 6)
సహజంగా ఏర్పడిన గుహలో కేశవనాథేశ్వరుని దర్శనం మహాద్భుతం. గుహ లోపల దాదాపు 50 అడుగుల దూరం నీటిలో వెళ్లి శివుడ్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ నీటిలో అనేక రకాల చేపలు ఉంటాయి. ఇవి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించవని పూజారులు అంటున్నారు. నీటిలో నిలబడి భగవంతుని దర్శనం, చేపలు పాదాలను ముద్దాడుతున్న అనుభవం అద్భుతంగా ఉంటుంది.
(3 / 6)
ఈ ఆలయం చాలా పురాతనమైంది. ఈ గుహ లోపల నుంచి శివుడు కాశీకి చేరుకున్నాడని భక్తుల విశ్వాసం. అదే విధంగా ఎందరో మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు.
(4 / 6)
కేశవనాథేశ్వరాలయం, సమీపంలో మెల్య సరస్సు అనుసంధానం అయి ఉంటాయి. ఈ సరస్సులో ఎల్ల అమావాస్య నాడు స్నానానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ రాతి నేలలు ఉంటాయి. ఆలయంలో నీటి పరిమాణం ఏడాది పొడవునా ఒకే విధంగా ఉంటుంది.
(5 / 6)
కర్ణాటక రాష్ట్రం కుందాపూర్ నుంచి కొల్లూరు మీదుగా కెరడి చేరుకుని అక్కడి నుంచి మూడగల్లు వెళ్లవచ్చు. ఉడిపి నుంచి హలాడి మీదుగా కెరడి చేరుకుని అక్కడి నుంచి మూడగల్లు వెళ్లవచ్చు.
ఇతర గ్యాలరీలు