Joe Root Record: చరిత్ర సృష్టించిన జో రూట్.. శ్రీలంకతో టెస్టులో సెంచరీ.. ఆ ముగ్గురినీ వెనక్కి నెట్టిన స్టార్ బ్యాటర్
- Joe Root Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ద్వారా కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను అతడు అధిగమించడం విశేషం.
- Joe Root Record: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ ద్వారా కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను అతడు అధిగమించడం విశేషం.
(1 / 5)
Joe Root Record: లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో అలెస్టర్ కుక్ పేరిట ఉన్న తిరుగులేని రికార్డును పంచుకున్నాడు. అంతేకాదు కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను రూట్ అధిగమించాడు.(AFP)
(2 / 5)
Joe Root Record: శ్రీలంకతో జరుగుతున్న లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ 162 బంతుల్లో 13 బౌండరీలతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్ లో రూట్ కు ఇది 33వ సెంచరీ. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్రిటీష్ క్రికెటర్ గా రూట్ నిలిచాడు. గతంలో కుక్ కూడా 33 సెంచరీలు చేయడంతో అతని రికార్డును సమం చేశాడు.
(3 / 5)
Joe Root Record: జో రూట్ 145 టెస్టుల్లో 264 ఇన్నింగ్స్ ఆడి 33 సెంచరీలు చేశాడు. అలెస్టర్ కుక్ 161 టెస్టుల్లో 191 ఇన్నింగ్స్ లో 33 సెంచరీలు చేశాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్, రూట్ తర్వాత కెవిన్ పీటర్సన్ ఉన్నాడు. అతడు 104 టెస్టుల్లో 181 ఇన్నింగ్స్ ఆడి 23 సెంచరీలు బాదాడు.
(4 / 5)
Joe Root Record: టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, స్టీవ్ వాలను జో రూట్ (33) అధిగమించాడు. ఈ ముగ్గురు స్టార్లు టెస్టుల్లో తలా 32 సెంచరీలు చేశారు. ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా జో రూట్ నిలిచాడు.
ఇతర గ్యాలరీలు