Indrakeeladri Temple : సామాన్య భక్తుడి రిక్షా ఎక్కిన బెజవాడ దుర్గమ్మ, 1955లో జరిగిన ఈ సంఘటన తెలుసా?
- Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 1955లో దుర్గమ్మ... ఓ సామాన్య భక్తుడి రిక్షా ఎక్కి ఊరేగిందని, అతడికి కానుకలు ఇచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది.
- Indrakeeladri Temple : ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. 1955లో దుర్గమ్మ... ఓ సామాన్య భక్తుడి రిక్షా ఎక్కి ఊరేగిందని, అతడికి కానుకలు ఇచ్చిందని ఓ కథ ప్రచారంలో ఉంది.
(1 / 6)
1955లో ఓ రిక్షా కార్మికుడు అర్ధరాత్రి సెకండ్ షో సినిమా తర్వాత వచ్చే బేరాలు చూసుకుని, రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. తనను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకువెళతావా? అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయినా రిక్షావాడు ఆవిడ ముఖంలో వెలుగును చూసి ఎక్కండమ్మా తీసుకెళ్తా అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ మాట్లాడుతూ... ఈ అర్ధరాత్రి వేళ కష్టబడుతున్నావు, నీకు భయం వేయదా? అని అతడిని అడిగింది. దానికతడు చిన్నగా నవ్వి భయం ఎందుకు అమ్మా...మా బెజవాడ దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా చూస్తుంటుందని చెప్పాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపునకు వెళ్లిపోయింది. రిక్షా అతను అమ్మా డబ్బులు అని చిన్నగా అడిగాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆ చీకట్లో కనుమరుగైంది. అతడికి ఏం అర్థం కాలేదు.(PC : Twitter)
(2 / 6)
రిక్షావాలా ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తున్నావ్... అని భార్య అడగగా అతడు జరిగిన విషయం చెప్పాడు. సర్లే ముందు వచ్చి తిను అని భార్య అనగా... అతను లేచి తలపాగా తీసి దులిపాడు. అందులోంచి భారీగా డబ్బుతో పాటు విలువైన బంగారు గాజు కింద పడింది. వాటిని చూసిన ఆ పేద దంపతులు నమ్మలేకపోయారు. పెద్దగా కేక పెట్టడంతో చుట్టు పక్కల వాళ్లు మేల్కొన్నారు. జరిగింది విని...సాక్షాత్తూ ఆ అమ్మవారే నీ రిక్షా ఎక్కారు. కానుకలు పుచ్చుకునే అమ్మ, నీకు కానుకలు కూడా ఇచ్చిందని అతన్ని, ఆ రిక్షాని తాకి ఆనందపడ్డారు. ఈ ఘటన గురించి 1955లో ఆంధ్ర కేసరి పత్రిక ప్రచురించింది. (PC : Twitter)
(3 / 6)
ఇంద్రకీలాద్రిపై వెలసిన బెజవాడ దుర్గమ్మను నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దసరా మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం విజయవాడ కనక దుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు చెబుతుంటారు. అర్జునుడు ఇంద్ర కీలాద్రిపై తపస్సు చేసి పరమేశ్వరుడి నుంచి పాశుపత అస్త్రాన్ని పొందతాడని పురాణాలు చెబుతున్నాయి. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని శివుడ్ని కోరతాడని, అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. (PC : Twitter)
(4 / 6)
బెజవాడ దుర్గమ్మ ఆలయ నిర్మాణంపై అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో విష్ణుకుండిన రాజైన మాధవవర్మ బెజవాడ నగరాన్ని పాలించేవాడు. ఆయనకు చాలా కాలానికి పుత్రుడు పుట్టాడు. ఒక రోజు రాకుమారుడు పెంకిగుర్రం రథంలో బయలుదేరాడు. ఆ గుర్రాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. దీంతో రాజ భటులు నగర వీధుల్లో హెచ్చరికలు జారీ చేస్తూ పరుగులు తీశారు. వీధిలో ఆడుకుంటున్న బాలుడికి వారి మాటలు వినిపించలేదు. ఇంతలో గుర్రపు రథాన్ని అదుపు చేయడానికి రాకుమారుడు ఎంత ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఆ సమయంలో బాలుడు రథం కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. (PC : Twitter)
(5 / 6)
బాలుడి మరణంతో తల్లడించిన తల్లి తనను బిడ్డ మృతదేహాన్ని రాజు వద్దకు తీసుకొచ్చి న్యాయం చేయమని రోధించింది. మాధవ వర్మ ఈ నేరానికి శిక్ష ఏంటో చెప్పాలని తన న్యాయాధికారులను కోరగా... మరణ శిక్ష విధించాలని వారు చెబుతారు. రాకుమారుడు కావాలని చేయలేదు కాబట్టి శిక్షను తగ్గించవచ్చని చెప్పినా... మహారాజు మాధవ వర్మ దానికి ఒప్పుకోలేదు. న్యాయం ఎవరికైనా ఒకేలా ఉండాలని తన కుమారుడికి మరణశిక్ష విధించాడు. ఆ శిక్షను అమలు చేశారు. అయితే మాధవవర్మ ధర్మపాలనకు సంతోషించిన బెజవాడ దుర్గమ్మ మరణించిన బాలుడిని, రాకుమారుడు ఇద్దరినీ బతికించి...కనక వర్షం కురిపించిందని ఓ కథ ప్రచారంలో ఉంది. అప్పటి నుంచి కనక దుర్గమ్మగా పేరుగాంచిందని చెబుతారు. (PC : Twitter)
(6 / 6)
దుర్గమ్మ వెలసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వత రూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో (గుహలో) నివశించమని ఘోర తపస్సు చేశాడు. కీలుని భక్తికి ప్రపూర్ణం అయిన జగదాంబ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభువుగా వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. కనకదుర్గను ఇంద్రాది దేవతలు వచ్చి, కృష్ణవేణీ నదిలో స్నానమాడి కనక దుర్గను పూజించారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. (PC : Twitter)
ఇతర గ్యాలరీలు