IND vs BAN Match Highlights: కాన్పూర్‌ టెస్టులో హైడ్రామాని.. అద్భుత విజయంగా టీమిండియా ఎలా మలిచిందంటే?-india vs bangladesh 2nd test match highlights ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ind Vs Ban Match Highlights: కాన్పూర్‌ టెస్టులో హైడ్రామాని.. అద్భుత విజయంగా టీమిండియా ఎలా మలిచిందంటే?

IND vs BAN Match Highlights: కాన్పూర్‌ టెస్టులో హైడ్రామాని.. అద్భుత విజయంగా టీమిండియా ఎలా మలిచిందంటే?

Oct 01, 2024, 06:01 PM IST Galeti Rajendra
Oct 01, 2024, 06:01 PM , IST

India vs Bangladesh 2nd Test: కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా మంగళవారం (అక్టోబరు 1న) ముగిసిన రెండో టెస్టులో టీమిండియా చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. డ్రా కోసం బంగ్లాదేశ్ వెంపర్లాడినా.. భారత్ జట్టు అలవోకగా గెలిచేసింది. 

భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌‌కివరుణుడు రెండు రోజులు అడ్డుపడినా.. మూడు రోజులే జరిగిన ఆట క్రికెట్ అభిమానులకి అంతులేని మజాని ఇచ్చింది. 

(1 / 12)

భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌‌కివరుణుడు రెండు రోజులు అడ్డుపడినా.. మూడు రోజులే జరిగిన ఆట క్రికెట్ అభిమానులకి అంతులేని మజాని ఇచ్చింది. (AFP)

శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌కి తొలి రోజే వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో టాస్‌తో పాటు మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలిరోజు 35 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది.  

(2 / 12)

శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌కి తొలి రోజే వరుణుడు అడ్డుపడ్డాడు. దాంతో టాస్‌తో పాటు మ్యాచ్ కూడా ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలిరోజు 35 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది.  (PTI)

శనివారం, ఆదివారం వర్షం కారణంగా కాన్పూర్ మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. ప్లేయర్లు, అంపైర్లతో పాటు ప్రేక్షకులు కూడా స్టేడియానికి వచ్చి నిరాశగా రెండు రోజులూ తిరిగి వెళ్లారు. కానీ చివరి రెండు రోజులూ వారికి కావాల్సినంత మజానికి టీమిండియా ఇచ్చింది. 

(3 / 12)

శనివారం, ఆదివారం వర్షం కారణంగా కాన్పూర్ మైదానం అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. ప్లేయర్లు, అంపైర్లతో పాటు ప్రేక్షకులు కూడా స్టేడియానికి వచ్చి నిరాశగా రెండు రోజులూ తిరిగి వెళ్లారు. కానీ చివరి రెండు రోజులూ వారికి కావాల్సినంత మజానికి టీమిండియా ఇచ్చింది. (PTI)

మ్యాచ్‌లో 4వ రోజైన సోమవారం బంగ్లాదేశ్ టీమ్‌ను 233 పరుగులకి భారత్ జట్టు బౌలర్లు ఆలౌట్ చేశారు. ఆ టీమ్‌లో మొమినుల్ హక్ 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులు చేశాడు. 

(4 / 12)

మ్యాచ్‌లో 4వ రోజైన సోమవారం బంగ్లాదేశ్ టీమ్‌ను 233 పరుగులకి భారత్ జట్టు బౌలర్లు ఆలౌట్ చేశారు. ఆ టీమ్‌లో మొమినుల్ హక్ 194 బంతుల్లో 17 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 107 పరుగులు చేశాడు. (AFP)

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన బౌలర్లందరికీ వికెట్లు దక్కడం విశేషం. 

(5 / 12)

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అశ్విన్, ఆకాశ్ దీప్ తలో రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసిన బౌలర్లందరికీ వికెట్లు దక్కడం విశేషం. (PTI)

బంగ్లాదేశ్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 34.4 ఓవర్ల వ్యవధిలోనే 285/9తో డిక్లేర్ చేసింది. టీమ్‌లో యశస్వి జైశ్వాల్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. 

(6 / 12)

బంగ్లాదేశ్ ఆలౌట్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా 34.4 ఓవర్ల వ్యవధిలోనే 285/9తో డిక్లేర్ చేసింది. టీమ్‌లో యశస్వి జైశ్వాల్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు, కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశారు. (PTI)

భారత్ బ్యాటర్ల దెబ్బకి తొలుత తడబడిన బంగ్లాదేశ్ బౌలర్లు.. ఆ తర్వాత పుంజుకోగలిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత్ జట్టు 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బంగ్లా టీమ్ బౌలర్లలో మిరాజ్, షకీబ్ నాలుగేసి వికెట్లు, హసన్ ఒక వికెట్ తీశాడు. 

(7 / 12)

భారత్ బ్యాటర్ల దెబ్బకి తొలుత తడబడిన బంగ్లాదేశ్ బౌలర్లు.. ఆ తర్వాత పుంజుకోగలిగారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారత్ జట్టు 52 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బంగ్లా టీమ్ బౌలర్లలో మిరాజ్, షకీబ్ నాలుగేసి వికెట్లు, హసన్ ఒక వికెట్ తీశాడు. (AFP)

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్ పేకమేడని తలపిస్తూ వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ షదామన్ ఇస్లామ్ 101 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో బంగ్లాదేశ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. 

(8 / 12)

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ టీమ్ పేకమేడని తలపిస్తూ వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ షదామన్ ఇస్లామ్ 101 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసినా.. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో బంగ్లాదేశ్ టీమ్ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌటైంది. (PTI)

తొలి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అకాశ్ దీప్‌కి ఒక వికెట్ దక్కింది. 

(9 / 12)

తొలి ఇన్నింగ్స్ తరహాలోనే రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ బౌలర్లు సమష్టిగా రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా, అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు పడగొట్టగా.. అకాశ్ దీప్‌కి ఒక వికెట్ దక్కింది. (PTI)

తొలి ఇన్నింగ్స్ 52 పరుగుల ఆధిక్యం లభించి ఉండటంతో.. భారత్ ముందు కేవలం 95 పరుగుల టార్గెట్ నిలిచింది. దాంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని టీమిండియా 17.2 ఓవర్లలోనే 98/3తో ఛేదించేసింది. టీమ్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 45 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 51 పరుగులు చేశాడు. 

(10 / 12)

తొలి ఇన్నింగ్స్ 52 పరుగుల ఆధిక్యం లభించి ఉండటంతో.. భారత్ ముందు కేవలం 95 పరుగుల టార్గెట్ నిలిచింది. దాంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని టీమిండియా 17.2 ఓవర్లలోనే 98/3తో ఛేదించేసింది. టీమ్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 45 బంతుల్లో 8x4, 1x6 సాయంతో 51 పరుగులు చేశాడు. (PTI)

మూడు రోజులు అయిపోయినా.. కేవలం 35 ఓవర్ల ఆటే అవడంతో.. మ్యాచ్ ఫలితం తేలడం కష్టమేనని అంతా అనుకున్నారు. మ్యాచ్ డ్రా అని క్రికెట్ పండితులు తేల్చేశారు. కానీ టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ల గురించి ఆలోచించకుండా టీ20 తరహా హిట్టింగ్‌తో బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టేసి..  7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

(11 / 12)

మూడు రోజులు అయిపోయినా.. కేవలం 35 ఓవర్ల ఆటే అవడంతో.. మ్యాచ్ ఫలితం తేలడం కష్టమేనని అంతా అనుకున్నారు. మ్యాచ్ డ్రా అని క్రికెట్ పండితులు తేల్చేశారు. కానీ టీమిండియా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ల గురించి ఆలోచించకుండా టీ20 తరహా హిట్టింగ్‌తో బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టేసి..  7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. (PTI)

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చెపాక్‌లో ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ భారత్ జట్టు 280 పరుగుల తేడాతో అలవోకగా గెలిచిన విషయం తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్ ద సిరీస్‌గా అశ్విన్ నిలిచాడు. 

(12 / 12)

బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ని భారత్ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. చెపాక్‌లో ఇటీవల ముగిసిన తొలి టెస్టులోనూ భారత్ జట్టు 280 పరుగుల తేడాతో అలవోకగా గెలిచిన విషయం తెలిసిందే. ప్లేయర్‌ ఆఫ్ ద సిరీస్‌గా అశ్విన్ నిలిచాడు. (PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు