India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన బుమ్రా, ఆకాశ్‌దీప్.. 149 పరుగులకే ఆలౌట్.. 227 పరుగుల లీడ్
- India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్ చేతులెత్తేసింది. టీమిండియా పేస్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇండియాకు ఏకంగా 227 రన్స్ ఆధిక్యం లభించింది. అయితే బంగ్లాకు ఫాలో ఆన్ ఇవ్వకుండా ఇండియా రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.

(1 / 6)
India vs Bangladesh 1st Test: టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాను 376 పరుగులకే కట్టడి చేసినా.. తర్వాత బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ ధాటికి బంగ్లా కేవలం 149 పరుగులే చేసింది.(PTI)
(2 / 6)
India vs Bangladesh 1st Test: టీమిండియా పేస్ బౌలర్ ఆకాశ్‌దీప్ రెండు వరుస వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనంలో తన వంతు పాత్ర పోషించాడు.(PTI)
(3 / 6)
India vs Bangladesh 1st Test: ఊహించినట్లే బంగ్లాదేశ్ పతనంలో కీలకపాత్ర పోషించింది మాత్రం జస్‌ప్రీత్ బుమ్రానే. తన నిప్పులు చెరిగే బౌలింగ్ తో 4 వికెట్లు తీశాడు.(AFP)
(4 / 6)
India vs Bangladesh 1st Test: బ్యాటింగ్ లో సెంచరీ మిస్సయినా.. బౌలింగ్ లోనూ రెండు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు రవీంద్ర జడేజా(PTI)
(5 / 6)
India vs Bangladesh 1st Test: బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ లోనే షాద్మాన్ ను ఇలా క్లీన్ బౌల్డ్ చేసి వికెట్ల వేట మొదలు పెట్టాడు బుమ్రా.(AP)
ఇతర గ్యాలరీలు